వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూపురం వైసీపీ అభ్యర్ధి ఎవరు - మంత్రి క్లారిటీ..!!

|
Google Oneindia TeluguNews

హిందూపురం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే వైసీపీ అభ్యర్ధి ఎవరు. ఏపీ రాజకీయాల్లో రానున్న ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. అన్ని పార్టీల్లోనూ అభ్యర్దుల అంశం పైన చర్చ సాగుతోంది. సిట్టింగ్ సీట్లలో మార్పులు ఉంటాయంటూ ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారాలను మరో పార్టీ వ్యూహాత్మకంగా ప్రచారంలోకి తెస్తోంది. అధికార వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వారికి ర్యాకింగ్ లు ఇచ్చారు. అందులో..ఇప్పటికీ యాక్టివ్ లేని ఎమ్మెల్యేలు..ప్రజలకు చేరువయ్యేందుకు సమయం నిర్దేశించారు.

Recommended Video

Chandrababu Kuppam Tour ఉచిత హామీల సునామీ *Politics | Telugu OneIndia
నియోజకవర్గం పై మంత్రి క్లారిటీ

నియోజకవర్గం పై మంత్రి క్లారిటీ


అయితే, ప్రజల్లో ఎవరి పట్ట వ్యతిరేకత ఉందనే అంశంలో స్థానికంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల సీట్ల పైన ప్రచారం కొనసాగుతోంది. అందులో భాగంగా.. అనంతపురం జిల్లా హిందూపురం లోక్ సభ.. శాసనసభ నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ప్రస్తుత మంత్రి ఉషా శ్రీ చరణ్ బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది. దీని పైన మంత్రి క్లారిటీ ఇచ్చారు. తాను తిరిగి కళ్యాణదుర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టత ఇచ్చారు. ఇదే అంశం పైన పార్టీ అధినాయకత్వం నుంచి హామీ ఉందని వెల్లడించారు. తాను కళ్యాణదుర్గం నియోజకవర్గం వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాజాగా గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ తరువాత హిందూపురం ఎంపీగా మంత్రి ఉసా శ్రీ చరణ్ ను దింపుతారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది.

బాలయ్య పోటీ ఖాయమేనా

బాలయ్య పోటీ ఖాయమేనా

దీంతో పాటుగా...హిందూపురంలో వైసీపీలో నెలకొన్ని విభేధాలు..అంతర్గత సమస్యలతో అక్కడ ఎమ్మెల్యే అభ్యర్ధిగా మంత్రి పేరు ప్రచారంలో ఉందంటూ కొనసాగుతున్న మరో ప్రచారం పైనా మంత్రిని ప్రశ్నించిన స్పందించారు. తాను వచ్చే ఎన్నికల్లోనూ కళ్యాణ దుర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కళ్యాణ దుర్గం నుంచి 2019 ఎన్నికల సమయంలో జగన్ వ్యూహాత్మకంగా బీసీ అభ్యర్ధిని బరిలోకి దించారు. హిందూపురం నుంచి మైనార్టీ అభ్యర్ధి పోటీ చేసారు. హిందూపురం అసెంబ్లీ పరిధిలొ వైసీపీ ఇంఛార్జ్ గా ప్రస్తుత ఎమ్మెల్సీ ఇక్బాల్ కొనసాగుతున్నారు. అయితే..స్థానికంగా పార్టీలో వర్గ పోరు కొనసాగుతోంది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి నందమూరి బాలయ్య ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.

సీఎం జగన్ - చంద్రబాబు కొత్త వ్యూహాలతో

సీఎం జగన్ - చంద్రబాబు కొత్త వ్యూహాలతో

మరోసారి బాలయ్య ఇక్కడ నుంచే పోటీ చేస్తారని చెబుతున్నా...కోస్తా ప్రాంతంలోని మరో సీటుకు పంపుతారనే ప్రచారమూ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. కానీ, బాలయ్య మాత్రం హిందూపురం నుంచే పోటీ చేస్తా..గెలుస్తానంటూ పార్టీ ముఖ్యనేతల వద్ద స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో..వైసీపీ నుంచి తిరిగి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం హిందూపురంతో పాటుగా ఉరవకొండ టీడీపీ ఖాతాలో ఉన్నాయి. గత ఎన్నికల్లో సీఎం జగన్ అమలు చేసిన బీసీ ఫార్ములా సక్సెస్ అయింది. ఈ సారి టీడీపీ సైతం అదే ప్రయోగం చేయటానికి సిద్దమవుతోంది. దీంతో..చివరి నిమిషంలో అనంతపురం జిల్లాలో ఎవరు అభ్యర్ధులుగా మారుతారో అనేది జిల్లాలో ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Minister Usha Sri Charan clariied that she will contest once agsin from Kalyana durgam constitunecy in up coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X