Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నియోజకవర్గం మార్పుపై మంత్రి వేణు సంచలన వ్యాఖ్యలు..!!

వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు కసతరత్తు కొనసాగుతోంది. సామాజిక సమీకరణాలు..గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ మార్పులు - చేర్పులు చేస్తున్నారు. తొలి విడతగా 11 మందిని మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. రెండో జాబితాలో పలువురు మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుతో గోదావరి జిల్లాల్లో జగన్ కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు. తన నియోజకవర్గం మార్పు పైన మంత్రి వేణుగోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు.

ఇంఛార్జ్ ల మార్పులు : వైసీపీలో పలువురు ముఖ్యుల నియోజకవర్గాల మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం, గుంటూరు జిల్లాలో మార్పుల పైన నిర్ణయం ప్రకటించారు. అదే విధంగా ఇతర జిల్లాల్లో కొందరిని తప్పించటం..మరి కొందరి సీట్ల మార్పు పైన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సీట్లు మార్పు చేయాల్సిన నియోజకవర్గాల్లోని సిట్టింగ్ లతో స్వయంగా చర్చలు చేసారు. సీట్లు మార్చే వారికి భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు. మంత్రులకు స్థాన చలనం తప్పటం లేదు. ఎంపీల్లో కొందరిని ఎమ్మెల్యేలుగా, సీనియర్లలో కొందరిని ఎంపీలుగా పంపేందుకు జగన్ సిద్దమయ్యారు. టీడీపీ, జనసేన పొత్తుతో గోదావరి జిల్లాల్లో ప్రభావం ఉంటుందనే అంచనాలతో అక్కడ మార్పులపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు.

MInister Venu Gopala Krishna interesting commets over his Constitunecy change as CM Jagan Decision

మంత్రి వేణు సీటు ఖరారు : ఇక, ప్రస్తుతం మంత్రిగా ఉన్న చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సీటు మారుతోంది. గతంలో రామచంద్రాపురం ఎమ్మెల్యేగా పని చేసిన ప్రస్తుత ఎంపీ బోసు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి ఈ సీటు ఇవ్వాలని కోరారు. ఇదే అంశం పైన వేణు వర్సస్ బోసు మధ్య విభేదాలు తలెత్తాయి. ఇప్పుడు మార్పుల్లో భాగంగా సీఎం తనకు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ సీట్లుకు వెళ్లమన్నారని మంత్రి వేణు వెల్లడించారు. ఆ సమయంలో తాను సీఎంకు విధేయుడినని..మీరు కత్తి పట్టుకొని నన్ను నరికేస్తానంటూ ఎందుకని అడగకుండా తల పెట్టగల సమర్ధత, ధైర్యం తనకు ఉన్నాయని చెప్పినట్లు వెల్లడించారు. టికెట్ విషయంలో జగన్ నన్ను అడగక ముందే పిల్లి సుభాష్ చంద్రబోస్‌ని అడిగితే ఆయన కాళ్లు కడిగి తలమీద నీళ్లు జల్లుకుని ఆయనకు అప్పగించేవాడినని చెప్పుకొచ్చారు.

MInister Venu Gopala Krishna interesting commets over his Constitunecy change as CM Jagan Decision

దటీజ్ వేణుగోపాల్ : తనను ఒక దొంగగానో, వేరేరకంగానో చిత్రీకరించడం బాధించిందని వేణు ఆవేదన వ్యక్తం చేసారు. తాను, తన కుమారుడు గాని అవినీతికి పాల్పడ్డారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు. పార్టీకోసం త్యాగం చేసి వెళుతున్నానని చెప్పారు రామచంద్రపురం నియోజకవర్గంలో మళ్లీ అశాంతి సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 30 ఏళ్ల శత్రువులైన ఎంపీ బోసు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను మిత్రులుగా మార్చిన ఘనత తనదేనని వేణు చెప్పుకొచ్చారు. దటీజ్ వేణుగోపాల్. శెట్టి బలిజలకు బోస్ ఒక ఐకాన్. పెద్దాయన వంద మాటలు అన్నా తాను ఏనాడు విమర్శించలేదన్నారు. 2019 ఎన్నికల్లో తనకు అడ్రస్ లేదన్నారు..కానీ ప్రజలు తరకు అడ్రస్ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఇద్దరు కాదు 20 మంది కలిసినా తన అడ్రస్ మారదు.. తన ఆధార్ కార్డు, తన ఇల్లు ఇక్కడే ఉందని మంత్రి వేణు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+