జగన్ సమక్షంలో, నిండు సభలో మంత్రి రజనీ ఎమోషనల్ ..!!

నియోజకవర్గ ప్రజల సమక్షంలో..బహిరంగ సభా వేదికపై..మంత్రి విడదల రజనీ ఉద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి గురించి చెబుతూ కన్నీటిని అదుపు చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ చిలకలూరిపేటలో ఫ్యామిటీ డాక్టర్ ప్రోగ్రాంను ప్రారంభించారు.

ఆ సభలో మంత్రి విడదల రజనీ తన రాజకీయ జీవితం..ఎమ్మెల్యే పదవి..మంత్రి పదవి అన్నీ జగనన్న పెట్టిన భిక్ష..ఎప్పటికీ రుణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుపైన ఫైర్ అయ్యారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారన్నారు. దమ్ముంటే వైద్య ఆరోగ్యరంగంలో మీ హయంలో ఏం చేశారో చెప్పాలి..

మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను: ముఖ్యమంత్రి జగన్ సభలో మంత్రి రజనీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. సభలో రజనీ.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, మీ ఆలోచన అమలే ధ్యేయంగా, మీ ఆదర్శాలే ఆచరణగా, మీ నాయకత్వమే నా అదృష్టంగా, మీరు నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని నేను నిజాయితీగా నిర్వర్తిస్తూనే ఉంటాను..అని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2007లో ఇదే ఏప్రిల్‌ నెలలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యరంగంలో ఆరోగ్యశ్రీతో విప్లవాత్మక పథకానికి నాంది పలికారని గుర్తు చేసారు. ఆరోగ్యశ్రీ పథకం దేశానికే దిక్సూచిగా నిలిచి సంచలనం సృష్టించిందని చెప్పారు. 16 ఏళ్ల తరువాత వైద్యరంగంలో ఇదే ఏప్రిల్‌లో ఆ మహానేత తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ తండ్రికి మించి పేదలకు మంచి అని మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టును ప్రారంభించారని వివరించారు.

 rajinijagan

ప్రతి ఒక్కరికీ ఆత్మబంధువులా: ముఖ్యమంత్రి జగన్ చక్కటి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని మంత్రి రజనీ ప్రశంసించారు. వలంటీర్‌ వ్యవస్థ గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మబంధువులా పనిచేస్తుందన్నారు. ఈ శకానికి ఈ ఫ్యామిలీ డాక్టర్‌ పథకం వినూత్నం, విలక్షణం. ఈ విధానం పక్క రాష్ట్రాల నుంచి కాపీ కొట్టింది కాదని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టింది కాదు.. ఇది జగనన్న మానస పుత్రికగా పేర్కొన్నారు.

యావత్‌ భారతదేశానికి ఆనాడు ఆరోగ్యశ్రీ ఎలా స్ఫూర్తినిచ్చిందో.. కచ్చితంగా నమ్ముతున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఈ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టు కూడా దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఫ్యామిలీ డాక్టర్‌ పథకం అవసరమైన ప్రతీ తలుపును ఈ స్టెతస్కోప్‌ తడుతుందని... ప్రతి గుండె చప్పుడును వింటుందని మంత్రి రజనీ పేర్కొన్నారు.

చంద్రబాబు పై విమర్శలు: మంత్రి రజనీ టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. ఏరోజు అయినా ఒక ఆస్పత్రికి సరైన డాక్టర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్‌ ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నించారు. ఒక కొత్త ఆస్పత్రి బిల్డింగ్‌ కట్టారా..ఉన్న ఆస్పత్రిని ఆధునీకరిద్దామని ఎప్పుడైనా ఆలోచించారా అని నిలదీసారు. 108, 104 వాహనాలు పెంచుదామని ఆలోచించారా అని రజనీ ప్రశ్నించారు.

ఇవేవీ చేయలేదు. దోచుకో, పంచుకో, తినుకో పథకం కోసం ఆరోగ్యరంగాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చాని విమర్శించారు. దమ్ముంటే వైద్య ఆరోగ్యరంగంలో మీ హయంలో ఏం చేశారో చెప్పాలని మంత్రి రజనీ డిమాండ్ చేసారు. నలుగురు ఎమ్మెల్యేలను కొనగలవేమో కానీ, జగనన్న కోసం ప్రాణం ఇచ్చే అభిమానులను కొనలేరంటూ మంత్రి రజనీ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+