ఈ జన్మలో సీఎం కాలేననే, ఆయన ఓ ఉన్మాది: జగన్ పై యనమల ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ జన్మలో ముఖ్యమంత్రిని కాలేననే అక్కసుతో ఆయన ఉన్మాదిలా మారారని విమర్శించారు.

జగన్ లో ఉన్మాదం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. సీఎంను కాలేననే కసితో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ, ప్రజలకు కీడు చేసేందుకు కూడా వెనుకాడడం లేదని ధ్వజమెత్తారు.

Minister Yanamala Ramakrishnudu slams YS Jagan

ప్రతిపక్ష నేతగా ఉంటూనే రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలకు మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారని యనమల మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నాయకులకు స్థానం లేదని... జగన్ పై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రిని బహిరంగంగా చంపాలని జగన్ పిలుపునిస్తున్నారని... ఎన్నికల సంఘానికి ఇంతకన్నా ఆధారం ఏమి కావాలని మంత్రి యనమల ప్రశ్నించారు. చంద్రబాబును ఎన్ని తిట్లు తిడితే, అన్ని ఓట్లు పడతాయని జగన్ కు ఎవరో చెప్పినట్టున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Finance Minister Yanamala Ramakrishnudu slams YCP Chief YS Jagan Mohan Reddy here in Amaravathi on Friday. He fires on Jagan over his comments on CM Chandrababu Naidu. And also Yanamala asked Election Commission to take strict action against Jagan
Please Wait while comments are loading...