'కడపలో డిపాజిట్ దక్కకుండా.. సీఎం పదవి పైనే ఆశ', 'మోడీకి అడ్డంగా దొరికిపోయారు'
వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో టిడిపియే విజయం సాధిస్తుందని మంత్రులు ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు అన్నారు.
అమరావతి: వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో టిడిపియే విజయం సాధిస్తుందని మంత్రులు ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు అన్నారు.

పులివెందులకు ఆ ఘనత బాబుదే
కడప జిల్లాలో కూడా వైసిపికి కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తామని మంత్రులు చెప్పారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు తాగు, సాగునీరు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జగన్ పదవీకాంక్షతో అన్ని విధాలా అడ్డుపడుతున్నారన్నారు.

ముఖ్యమంత్రి పదవి పైనే యావ
జగన్ తన సొంత పత్రిక, చానల్ పెట్టుకొని అసత్య ఆరోపణలు చేయిస్తూ నిత్యం ప్రభుత్వ పథకాలపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి మీద యావ తప్ప రాష్ట్ర అభివృద్ధ్దిపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.

మోడీకి అడ్డంగా దొరికిపోయారు
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు, ఆర్థిక నేరాల కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్‌లు ప్రధాని నరేంద్ర మోడీకి బందీలుగా మారి ప్రజా సమస్యలను విస్మరించారని పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి వేరుగా ఆరోపించారు. వారిద్దరు మోడీకి అడ్డంగా దొరికిపోయారన్నారు. వారిద్దరూ కేసులకు భయపడి ప్రత్యేక హోదాపై మోడీ వద్ద నోరు విప్పడం లేదన్నారు.

రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే
రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయితే రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని రఘువీరా ప్రకటించారు. కడ ఊపిరి దాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ అభివృద్ధికి అంకితమవుతానని చెప్పారు.

వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తేనని, రాహుల్‌ను ప్రధానిగా చేయడం లక్ష్యంగా భావించాడని, ఆయన లక్ష్యసాధన కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.












Click it and Unblock the Notifications