బాబు కేబినెట్లో మంత్రులు వీరే, సామాజిక వర్గాల వారిగా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడితో పాటు 19మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందులో కెఈ కృష్ణమూర్తి, చినరాజప్పలకు ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించినట్లుగా తెలుస్తోంది.
సమాచారం మేరకు... చంద్రబాబు కేబినెట్లో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. బిజెపి నుండి ఇద్దరికి (మాణిక్యాల రావు, కామినేని శ్రీనివాస్) అవకాశం వచ్చింది. ఏ సభలోను ప్రాతినిథ్యం లేని నారాయణకు కేబినెట్లో చోటు దక్కింది. కృష్ణా జిల్లా నుండి అధికంగా ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కింది. తొలిసారి గెలిచిన వారిలో ఏడుగురికి దక్కింది.

కమ్మ, కాపు సామాజికవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. డిప్యూటీ సిఎంతో కలిసి కాపులకు ఐదు, సిఎంతో కలిపి కమ్మలకు ఐదు మంత్రి పదవులు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన వారిలో గంటా శ్రీనివాస రావుకు మాత్రమే చోటు దక్కింది. కడప జిల్లాలో ఎవరికీ చోటు దక్కలేదు. అలాగే ఎస్టీ, ముస్లిం నుండి సభ్యులు లేరు. ముస్లిం సభ్యులు ఎవరు కూడా టిడిపి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందలేదు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారు
శ్రీకాకుళం - అచ్చెన్నాయుడు
విజయనగరం - మృణాళిని
కర్నూలు - కెఈ కృష్ణమూర్తి
కృష్ణా - దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్ (బిజెపి)
విశాఖ - అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస రావు
తూర్పు గోదావరి - యనమల రామకృష్ణుడు, చినరాజప్ప
పశ్చిమ గోదావరి - పీతల సుజాత, మాణిక్యాల రావు (బిజెపి)
గుంటూరు - పత్తిపాటి పుల్లారావు, కిశోర్
ప్రకాశం - శిద్దా రాఘవు రావు
నెల్లూరు - నారాయణ
చిత్తూరు - బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి
అనంతపురం - పరిటాల సునిత, పల్లె రఘునాథ రెడ్డి
సామాజిక వర్గాల వారిగా చూస్తే...
సిఎంతో సహా కమ్మ సామాజిక వర్గానికి ఐదు, డిప్యూటీ సిఎం సహా కాపు సామాజిక వర్గానికి ఐదు దక్కాయి.
కమ్మ - చంద్రబాబునాయుడు, పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వర రావు, పుల్లారావు, కామినేని శ్రీనివాస్
కాపు - చినరాజప్ప, మృణాళిని, నారాయణ, గంటా శ్రీనివాస రావు, మాణిక్యాల రావు
రెడ్డి - బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి
యాదవ - యనమల రామకృష్ణుడు
ఎస్సీ - పీతల సుజాత, రావెళ్ల కిశోర్
వైశ్య - శిద్దా రాఘవ రావు
మత్స్యకార - కొల్లు రవీంద్ర
గౌడ - కెఈ కృష్ణమూర్తి
వెలమ - అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు












Click it and Unblock the Notifications