సాక్షి ఉందని జగన్ ఆడుతున్నాడు, మంత్రులు మాస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 110 రోజులు అయ్యిందని, ఈ మూడు నెలల కాలంలోనే ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశామని, ఈ విషయం జగన్ కి కనపడటం లేదా అని ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనిత, నారాయణ, అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. చేతిలో సాక్షి పేపర్ ఉందని ఇష్టం వచ్చినట్ తప్పుడు కథనాలు ప్రచురిస్తే చూస్తూ ఊరుకోమని మంత్రులు మాజీ సీఎం జగన్ ను హెచ్చరించారు.

సాక్షి పత్రికలో ఇప్పుడు వచ్చే తప్పుడు కథనాలను ప్రజలు చూసే పరిస్థితిలో లేరని, ఆ పత్రిక చూడడానికి కూడా ప్రజలు ఇష్టపడడం లేదనే విషయం జగన్ తెలుసుకుంటే మంచిదని మంత్రులు మండిపడ్డారు. ఐదు సంవత్సరాలు పాటు అధికారంలో ఉన్న జగన్, వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ను లూటీ చేశారని మంత్రులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ను దోచుకున్న జగన్ విజయవాడ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో కనీసం వరద బాధితులకు సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేదని మంత్రులు ఆరోపించారు.

Ministers of Andhra Pradesh are angry with the behavior of former CM Jagan

ప్రజలను దోచుకున్న జగన్ ఆ ప్రజలకు సహాయం చేయడానికి చేతులు కూడా రాలేదని, సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. భారీ వర్షాలు వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందని పూర్తి వివరాలు ఇస్తున్నామని, ఈ విషయంలో ఎలాంటి చర్చకు అయినా మేము సిద్దంగా ఉన్నామని మంత్రులు స్పష్టం చేశారు.

Ministers of Andhra Pradesh are angry with the behavior of former CM Jagan

వరద బాధితులకు ఖర్చు చేసిన విషయంలో ఇక్కడ ఏదీ దాచి పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రులు స్పష్టం చేశారు. వరద సాయం కింద మొత్తం రూ. 601 కోట్లు ఖర్చు చేశామని మంత్రులు వివరించారు. ఆహారానికి, తాగునీరు, మెడికల్ కేర్ కు అయినా ఖర్చులను మంత్రులు వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో వరద బాధితుల కోసం రూ. 139 కోట్లకు పైగా ఖర్చు పెట్టానని మంత్రులు వివరించారు.

వరదల కారణంగా ఇబ్బందులు పడిన ప్రజలకు సహాయం చేయకుండా జగన్ బ్యాచ్ చంద్రబాబు ప్రభుత్వం పైన లేనిపోని ఆరోపణలు చేస్తుందని, సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని తప్పుడు కథనాలు ప్రజలకు అందిస్తోందని మంత్రులు ఆరోపించారు. జగన్ తీరు మార్చుకోకపోతే ఆయనకు తగిన బుద్ధి చెబుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనిత, నారాయణ, అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+