బాబు మాటను పెడచెవిన పెట్టిన మంజునాథ: 'పటేళ్ల గతే కాపులకు'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: కాపు రిజర్వే,షన్ల విషయంలో మంత్రి నారాయణ బిసి కమిషన్ చైర్మన్ మంజునాథను తప్పు పట్టే ప్రయత్నం చేశారు. కాపు రిజర్వేషన్లపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

  Chandrababu Naidu on Kapu Reservation Bill in AP Assembly | Oneindia Telugu

  కాపు కోటాపై మరో వివాదం: జస్టిస్ మంజునాథ్ సంచలనం

  రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వటంలో జస్టిస్‌ మంజునాథ జాప్యం చేస్తున్నారని మంత్రి చెప్పారు. నలుగురు సభ్యుల్లో ముగ్గురు మాత్రమే ఇప్పటి వరకు నివేదిక ఇచ్చారని, దీంతో మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో ముందుకు వెళ్లామని మంత్రి తెలిపారు.

   అందుకే కేంద్రానికి...

  అందుకే కేంద్రానికి...

  రిజర్వేషన్లు 50 శాతం దాటితే 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంటుందని, అందుకే తీర్మానం చేసి కేంద్రానికి పంపామని మంత్రి నారాయణ చెప్పారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రావనే తాము అనుకుంటున్నామని, బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు.

  మంజునాథపై భిన్నాభిప్రాయాలు...

  మంజునాథపై భిన్నాభిప్రాయాలు...

  కాపు కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మంజునాథ రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కమిషన్‌ సభ్యులుగా శ్రీమంతుల సత్యనారాయణ, మల్లెల పూర్ణచంద్రరావు, సుబ్రమణ్యం ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్‌ కల్పించాలనేప్రతిపాదనను ఈ ముగ్గురు సభ్యులు సమర్థించారు. చైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ మంజునాథ మాత్రం తన సిఫారసులు ఇవ్వలేదు. కమిషన్‌ సమష్టిగా ఏకాభిప్రాయంతో నివేదిక ఇస్తే బాగుంటుందని సీఎం చెబితే మంజునాథ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

   దాని వల్ల బిసీలకు నష్టం లేదు.....

  దాని వల్ల బిసీలకు నష్టం లేదు.....

  కాపులకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీల ప్రయోజనాలు ఎక్కడా దెబ్బతినవని డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కాపులకు అదనంగా 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. కాపు రిజర్వేషన్‌ విద్య, ఉద్యోగ నియామకాలకే పరిమితమని, బీసీలకు నష్టం కలగనప్పుడు కాపు రిజర్వేషన్‌ను పెద్ద మనుసుతో ఆహ్వానించాలని ఆయన అన్నారు. వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చడాన్ని స్వాగతిస్తున్నామని కేఈ చెప్పారు.

   పటేళ్ల గతే కాపులకు...

  పటేళ్ల గతే కాపులకు...

  కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించడం అభినందనీయమని మాజీ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరరామజోగయ్య హర్షం వ్యక్తం చేశారు. అయితే మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటితే 9వ షెడ్యూల్‌లో ఇంక్లూడ్ కాకుంటే గుజరాత్‌లో పటేళ్లకు పట్టిన గతే ఇక్కడ కాపులకు పడుతుందని ఆయన చెప్పారు. ఇక్కడ కాపులకు న్యాయం జరగాలంటే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా కేంద్రం బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh minister Narayana has blamed BC Commission chairman Manjunatha on Kapu reservations.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి