సీఎం రమేష్ vs ఎమ్మెల్యే ఆది - కడపలో కలకలం..!!
కమలం పార్టీ నేతల మధ్య వర్గ పోరు తారా స్థాయికి చేరింది. బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే మద్ద ఆధిపత్య పోరు కూటమికి సమస్యగా మారుతోంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య వివాదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఎంపీ రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీ సిబ్బందిపై జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం కలకలంగా మారింది. ఈ ఘటన పైన ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఇద్దరి నేతల మధ్య దశాబ్ద కాలం గా ఉన్న వైరం ఇప్పుడు పతాక స్థాయికి చేరటంతో కూటమి నేతల మధ్య చర్చగా మారింది.
సీఎం రమేశ్ - ఎమ్మెల్యే అదినారాయణ మధ్య చాలా కాలంగా అంతర్గత పోరు కొనసాగుతోంది. సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయం లో ఇరువురి మధ్య అంతర్గత పోరు కొనసాగింది. 2014లో ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వచ్చినా ఇద్దరి మధ్య సఖ్యత కుదర్లేదు. ప్రస్తుతం ఇద్దరూ బీజేపీలోనే ఎంపీ, ఎమ్మెల్యేగా ఉంటున్నా ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కూటమికి సమస్యగా మారుతోంది. జమ్మలమడుగు మండలం గండికోట పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాస్కీ పథకం కింద రూ.79 కోట్లు మంజూరు చేసింది.

కాగా, వీటిలో రూ.50 కోట్ల పనులకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఇందులో భాగంగా గండికోటలో 2 భవనాలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు చేయకుండా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెండు వారాల కిందట వరసగా రెండుమార్లు పనులు అడ్డుకున్న కార్యకర్తలు సోమవారం ఏకంగా దాదాపు 50 మంది వరకు వాహనాల్లో గండికోటకు వెళ్లి రిత్విక్ కంపెనీ సిబ్బందిపై దాడి చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను పిలిచి విచారించారు. వారి నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఏడాది కిందట కొండాపురం మండలంలో అదానీ సంస్థకు దక్కిన పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు పనులను సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. 300 కోట్ల రూపాయలతో 1000 మెగావాట్లతో నిర్మిస్తున్న ప్లాంట్ పనులను 2024 నవంబర్‌లో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు కార్యాలయం, షెడ్లపై రాళ్లదాడి చేయగా పలువురిపై కొండాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సీఎం రమేష్ గతంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్‌కుమార్‌కు లేఖ రాశారు. జమ్మలమడుగులో రిపబ్లిక్ క్లబ్ పేరుతో విచ్చలవిడిగా జూదం, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ రోజుకు లక్షల్లో జూదం జరుగుతోందని లేఖ రాశారు. ఇదంతా దేవగుడి నాగేశ్వర్‌రెడ్డి ఆద్వర్యంలో కొనసాగుతోందని బహిరంగ లేఖ రాశారు. సీఎం రమేష్ లేఖతో జమ్మలమడుగు డీఎస్పీ బృందం వెళ్లి క్లబ్‌ను మూసి వేయించారు. ఇలా.. ఇద్దరి మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు కూటమి నేతలకు అంతు చిక్కటం లేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications