సాయిరెడ్డికి బీజేపీ కంగ్రాట్స్- సీన్ ఛేంజ్..!!
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికల్లో ఓడిన వైసీపీలో అనూహ్య పరిణామా లు చోటు చేసుకుంటున్నాయి. కూటమి నేతలు ఆ పార్టీ పైన గురి పెట్టారు. తాజాగా విజయ సాయి రెడ్డి పార్టీ వీడటం సంచలనంగా మారింది. సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం సాగినా.. తాను రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించారు. సాయిరెడ్డి రాజీనామా ఆమోదించారు. ఇక, ఇదే సమయంలో బీజేపీ ముఖ్య నేత తాజా నిర్ణయం పై సాయిరెడ్డిని అభినందించటంతో ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంటోంది.
వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి సెలవు తీసుకున్నారు. తాను ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగలేనని స్పష్టం చేసారు. వైసీపీ పరిణామాల వలనే సాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో బీజేపీలో వెళ్లేందుకు సాయిరెడ్డి సిద్దం అయ్యారంటూ వార్తలు వచ్చాయి. కానీ, సాయిరెడ్డి తాను ఏ పార్టీలో చేరటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఇదే అంశం పైన బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్య లు చేసారు. వైసీపీ చివరి దశకు చేరిందని వ్యాఖ్యానించారు. జగన్ -సాయిరెడ్డి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు.

విజయసాయిరెడ్డి తప్పించుకోలేని విధంగా తప్పులు చేసారని చెప్పుకొచ్చారు. వైసీపీలో ఉన్న ఇతర నేతలు కూడా బయటకు రావాలని ఆది నారాయణ రెడ్డి సూచించారు. వీరి విభేదాల కారణంగా సాయిరెడ్డి అన్ని పార్టీల చుట్టూ తిరిగారని చెప్పుకొచ్చారు. కానీ, ఏ పార్టీ సాయిరెడ్డిని ఆహ్వానించలేదని చెప్పారు. వైసీపీ నుంచి బయటకు వచ్చినందుకు సాయిరెడ్డిని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నట్లు వెల్లడించారు. వివేకా హత్యపై ఆయన నిజాలు చెప్పారని పేర్కొన్నారు. పులివెందులలో డీఎస్పీ మురళీ నాయక్‌ను జగన్ బెదిరించారని విమర్శించారు. వివేకా హత్య కేసు పై సీరియస్ గా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతానని ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications