హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ భారీ ర్యాలీ, మౌన దీక్ష; జిల్లాకేంద్రం కోసం బాలయ్య పోరుబాట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా పలు ప్రాంతాలలో పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలోని హిందూ పురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రంగంలోకి దిగిన ప్రముఖ సినీ నటుడు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

హిందూపురంలో బాలకృష్ణ భారీ ర్యాలీ, స్వల్ప తోపులాట

హిందూపురంలో బాలకృష్ణ భారీ ర్యాలీ, స్వల్ప తోపులాట

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలో భాగంగా సత్యసాయి జిల్లాలో తన నియోజకవర్గం హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించిన బాలకృష్ణ మౌన దీక్షకు దిగారు. పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బాలకృష్ణ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో పలువురు స్థానిక నేతలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు భారీగా పాల్గొన్నారు. పార్టీలకతీతంగా హిందూపురం జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్ ను వినిపించారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కాస్త తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. జై బాలయ్య నినాదాలతో యువకులు ర్యాలీని హోరెత్తించారు.

అంబేద్కర్ కూడలిలో మౌన దీక్షకు దిగిన బాలకృష్ణ

అంబేద్కర్ కూడలిలో మౌన దీక్షకు దిగిన బాలకృష్ణ


అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ అంబేద్కర్ కూడలిలో మౌన దీక్షకు కూర్చున్నారు. హిందూపురం జిల్లా సాధనకై మౌన దీక్ష చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురం జిల్లా కేంద్రంగా చేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలోనే ప్రతిపాదిత సత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఉంచాలని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణఅసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పనిలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పనిలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. హిందూపురానికి జిల్లా కేంద్రానికి కావాల్సిన అర్హతలు ఉన్నాయని, అయినప్పటికీ పుట్టపర్తిని జిల్లా కేంద్రం చెయ్యటం దేనికని నందమూరి బాలకృష్ణ ప్రశ్నించారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికుల నుండి కూడా పెద్దఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హిందూపురం జిల్లా కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగి మౌన దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Recommended Video

    AP Panchayat Elections: Balakrishna Hindupur Tour
    హిందూపురం కోసం అఖిల పక్ష నేతలతో బాలయ్య భేటీ.. భవిష్యత్ కార్యాచరణ ప్లాన్

    హిందూపురం కోసం అఖిల పక్ష నేతలతో బాలయ్య భేటీ.. భవిష్యత్ కార్యాచరణ ప్లాన్


    సాయంత్రం అఖిలపక్ష నాయకులతోభవిష్యత్ కార్యాచరణపై బాలయ్య చర్చించనున్నారు.అనంతరం టీడీపీ కార్యకర్తలతోనూ ఆయన సమావేశం కానున్నారు. హిందూపురం జిల్లా కేంద్రం చెయ్యటం కోసం భవిష్యత్ కార్యాచరణ బాలకృష్ణ రూపొందించనున్నారు. హిందూపురంలోక్‌సభ నియోజకవర్గమని, సహజంగానే జిల్లా కేంద్రంగా కూడా ఉండాలని హిందూపురం వాసులు కోరుతున్నారు. హిందూపురం జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ నేరుగా రంగంలోకి దిగడంతో జగన్ సర్కార్ ఈ వ్యవహారంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+