పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీచేసినా ఆ పని చేస్తా; ఎమ్మెల్యే ద్వారంపూడి సంచలనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగిన నాటి నుండి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొత్తులతో వచ్చే ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారని, పార్టీ కి అన్యాయం చేస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోమారు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు.

మరోమారు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

మరోమారు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

వైసిపి వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో అప్పటినుంచి వైసీపీ మంత్రులు, నేతలు నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. చంద్రబాబును సీఎం చేయడం కోసం పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సభలో ప్రత్యేకించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ని టార్గెట్ చేసి భీమ్లానాయక్ ట్రీట్మెంట్ చూపిస్తానంటూ హెచ్చరించడంతో పవన్ కళ్యాణ్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాటల దాడి చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరో మారు పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ ద్వారంపూడి

తాజా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ ద్వారంపూడి

తాజాగా పవన్ కళ్యాణ్ కాకినాడలో పన్ను చెల్లింపు పోతే వాహనాలు జప్తు చేస్తామంటూ మున్సిపల్ అధికారులు వాహనాలకు ఫ్లెక్సీలు కట్టి తిప్పుతున్నారంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజల మంచి కోసం పరిపాలన చేస్తున్నట్టు ఏ కోశాన కనిపించడం లేదంటూ, డైలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళ ఆలోచనలా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ట్రాక్టర్ లు వేసుకొని తిరగడం కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా మండిపడిన వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది అంటూ హితవు పలికారు.

జనసేన నమ్ముకున్న జనసైనికులు బాధపడే రోజు వస్తుంది: ద్వారంపూడి

జనసేన నమ్ముకున్న జనసైనికులు బాధపడే రోజు వస్తుంది: ద్వారంపూడి

శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన జనసేన పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నారని, పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు, పార్టీ నాయకులు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. త్వరలో జనసేన నమ్ముకున్న జనసైనికులు బాధపడే రోజు వస్తుందని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయిన నేతలు ముందు ఆ విషయం చూడాలని, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు.

పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేసినా సరే ఓడిస్తా.. ద్వారంపూడి సవాల్

పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేసినా సరే ఓడిస్తా.. ద్వారంపూడి సవాల్

సాక్షాత్తు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడవడం ఒక లెక్కనా అంటూ పేర్కొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే తాను ఓడిస్తానని స్పష్టం చేశారు. ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో తాను ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకుంటానని పేర్కొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసి పవన్ కళ్యాణ్ ను ఓడిస్తాం అంటూ సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+