కెసిఆర్ ఆదేశం: గురుకుల్ వద్ద ఉద్రిక్తత, ఎమ్మెల్యే అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్ గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసి అధికారులు ట్రస్టు భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు.
మాదాపూర్ అయ్యప్పసొసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత మంగళవారం రెండో రోజు కొనసాగుతోంది. స్థానికంగా ఉన్న ఓ పాఠశాల భవనం కూల్చివేతకు రంగం సిద్ధమవడంతో యాజమాన్యం పాఠశాలకు సెలవు ప్రకటించింది. మరోవైపు, హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.
కూల్చివేతను ఆపాలంటూ ఎమ్మెల్యే గాంధీ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురుకల ట్రస్ట్ భూముల్లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కెసిఆర్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
అరెస్టు సమయంలో ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. తెరాస కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెరాస నేతల ఇళ్లను వదిలి మిగతా వారిపై పడ్డారని ఆరోపించారు. తెలిసీ, తెలియక కొన్న భూములను రెగ్యూలరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

గురుకుల ట్రస్ట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత రెండో రోజు మంగళవారం కొనసాగింది.

గురుకుల ట్రస్ట్
స్థానికుల నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాకుండా భారీ భద్రత అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం కొనసాగింది.

గురుకుల ట్రస్ట్
ఓ పాఠశాల భవనం కూల్చివేతకు రంగం సిద్ధమవడంతో యాజమాన్యం పాఠశాలకు సెలవు ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో రంగంలోకి దిగిన 10 బృందాలు భవనాలను కూల్చివేశారు.

గురుకుల ట్రస్ట్
గురుకుల ట్రస్ట్‌కు చెందిన అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ముందు అధికారులు నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

గురుకుల ట్రస్ట్
హైదరాబాదులోని అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాలను అధికారులు సోమవారం కూల్చివేశారు. రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది.

గురుకుల ట్రస్ట్
అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాలను అధికారులు సోమవారం కూల్చివేశారు. రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. అధఇకారులు ఇరవై వరకు బిల్డింగ్స్‌ను కూల్చివేశారు.

Click it and Unblock the Notifications