అప్పుడు బీకామ్‌లో ఫిజిక్స్, ఇప్పుడు మెట్రిక్యులేషన్‌లో ఎంపీసీ: హయ్యో 'జలీల్'..

Subscribe to Oneindia Telugu

విజయవాడ: బీకామ్‌లో ఫిజిక్స్ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ మరోసారి తడబడ్డారు. తన విద్యార్హతకు సంబంధించిన కామెంట్స్‌పై ఇప్పటికే ఓసారి నవ్వులపాలైన జలీల్ ఖాన్.. ఈ సారి 'మెట్రిక్యులేషన్‌లో ఎంపీసీ' చదివానంటూ వ్యాఖ్యానించడం మరోసారి ఆయన్ను నవ్వులపాలు చేసేదిగా తయారైంది.

తాజాగా ఓ టీవి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్బంగా జలీల్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తొలుత బీకామ్‌లో ఫిజిక్స్ వ్యాఖ్యలు తాను చేయలేదని చెప్పుకొచ్చిన జలీల్ ఖాన్.. తాను మెట్రిక్యులేషన్‌లో ఎంపీసీ చేశానని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ సవరించుకుని.. మెట్రిక్యులేషన్ కాదని పీయూసీలో ఎంపీసీ చేశానని అన్నారు. అదే వ్యాఖ్యను కొనసాగిస్తూ.. 30ఏళ్ల క్రితం చదువును ఇప్పుడడిగితే ఏం గుర్తుంటుందని అన్నారు.

mla jaleel khan again tongue slips in another interview

అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సైతం ఇటీవల ఓసారి తడబడ్డారని గుర్తుచేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. రెండు 28లు 64 అవుతుందని జగన్ తప్పుగా పేర్కొనలేదా? అని గుర్తుచేశారు. రాష్ట్రంలో పట్టించుకోవాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని, వాటిపై ఫోకస్ చేయాలని జలీల్ ఖాన్ సూచించడం గమనార్హం. మొత్తం మీద మెట్రిక్యులేషన్ లో ఎంపీసీ అంటూ జలీల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp MLA Jaleel Khan again slipped his tongue in another interview. He said he studied mpc group in matriculation
Please Wait while comments are loading...