జేసీ సంచలన వ్యాఖ్యలు, జగన్ కాళ్లు పట్టుకోలేమని రఘువీరా కౌంటర్
అనంతపురం: తాడిపత్రి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సబ్సిడీ వేరుశనగ విత్తనాలు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు కొందరు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు.
దళారుల సహకారంతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని మండిపడ్డారు. వేరుశనగ విత్తనాల ధరలు పెరిగినందునే సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ పెరిగిందన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి పోయాక రఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా: రఘువీరా
తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణంలో రహస్య అజెండా ఉందని చెప్పారు. దేశభద్రతకు ముప్పువాటిల్లో ప్రమాదం ఉన్నప్పటికీ చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మన రైతుల భూములను ఇతర దేశాలవాళ్లకు ఇవ్వడం తప్పన్నారు.
కాంగ్రెస్ పార్టీలో తాము తప్ప ఎవరూ ఉండరన్న వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారని రఘువీరా జేసీకి కౌంటర్ ఇచ్చారు. వాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో ప్రజలందరికీ తెలుసునన్నారు. హంతకులు, దోషులు, ఫ్యాక్షనిస్టులను రాష్ట్ర బహిష్కరణ చేయాలన్న చంద్రబాబు పంచన చేరిందెవరని ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్నామని తాము చంద్రబాబు, జగన్ కాళ్లు పట్టుకోమన్నారు.

అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్టు
చైనా, హాంకాంగ్‌లకు చెందిన ఇద్దరు ఎర్ర చందనం అంతర్జాతీయ స్మగ్లర్లను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. చిన్నమండెం పోలీసులు స్మగ్లర్ల ముఠాను పట్టుకొని రాయచోటి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
వీరు బెంగళూరు కేంద్రంగా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కోసం వారు కొత్త దారులు వెతుక్కుంటున్నారని తెలుస్తోంది. కొరియర్ ద్వారా ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు ఎత్తుగడ వేశారు.












Click it and Unblock the Notifications