చంద్రబాబు వద్దకు పీకేను పంపింది ఆ ముఖ్యమంత్రే..!!

ఏపీ రాజకీయాల్లో మరోసారి ప్రశాంత్ కిషోర్ పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఏపీ రాజకీయాల పైన చర్చించారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పైన విమర్శలు చేసిన టీడీపీ..ఇప్పుడు ఆయన సలహాలు తీసుకోవటం పైన వైసీపీ నేతలు కార్నర్ చేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు వద్దకు ప్రశాంత్ కిషోర్ రావటం వెనుక కారణాలను బయట పెడుతున్నారు.

చంద్రబాబుతో తాజాగా ప్రశాంత్ కిషోర్ భేటీ పైన వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు.చంద్రబాబు ఎంతమంది పికేలను పెట్టుకున్న.సీఎం జగన్ ను ఏం చేయలేరని ఘాటు వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అనీ సీఎం జగన్.. తాము రోజు చెబుతూనే ఉన్నామని గుర్తు చేసారు. ఇప్పుడు ప్రశాంతి కిషోర్ ను కలిస్తే భూమి బద్దలై పోతుందా అని నాని ప్రశ్నించారు.

MLA Kodali Nani seriously reacts on Chandra Babu and Prasanth Kishor meeting

ప్రశాంత్ కిషోర్ ను మేము పూర్తిగా వాడేసామని వ్యాఖ్యానించారు. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని పేర్కొన్నారు.మా వ్యూహకర్తగా ఉన్నప్పుడు బీహార్ నుండి వచ్చినా ప్రశాంత్ ఏం పికుతాడు తమ్ముళ్లు అన్న చంద్రబాబు .....ఇప్పుడు ఏం పికడానికి భేటీ అయ్యాడో పసుపు తమ్ముళ్లకు చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రశాంత్ సూచనలతో బాబాయ్ ని చంపి, జగన్ కోడి కత్తి డ్రామాలు అడారని ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిందని చెప్పుకొచ్చారు.

MLA Kodali Nani seriously reacts on Chandra Babu and Prasanth Kishor meeting

ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో టీడీపీ దేని కోసం సిద్దమైందని ప్రశ్నించారు. ప్రశాంతి కిషోర్ కు, ఐప్యాక్ కు సంబంధం లేదని నాని స్పష్టం చేసారు. ఇండియా కూటమిలో చేరమని సీఎం మమతా బెనర్జీ పంపితే ప్రశాంత్ కిషోర్ వచ్చారని చెప్పారు. పార్టనర్ పికె బీజేపీతో చర్చలు జరుపుతుంటే.. చంద్రబాబు ప్రశాంత్ కిషోర్.. ఇండియ కూటమి, మమతా బెనర్జీ,కాంగ్రెస్ తో చర్చలు జరుపుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేసారు. చంద్రబాబు తన రెండు కళ్ళ సిద్దాంతాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+