వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిక్కుల్లో రఘురామ - సిట్ నోటీసుల వెనుక : ఏపీ టు తెలంగాణ..!!

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ రఘరామకు కొత్త చిక్కులు మొదలయ్యాయి. తెలంగాణలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. నిందితులుగా ఉన్న వ్యక్తులతో సంబంధాల పై రఘురామకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న విచారణకు రావాలని సూచించింది. ఏపీలో రఘురామ పైన సీఐడీ కేసులు నమోదు చేసింది. సుప్రీం వరకు వెళ్లి రఘురామ బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణ లో సిట్ రఘురామకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు..రఘురామ పాత్ర ఏంటి, రాజకీయంగా ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.

రఘరామకు సిట్ నోటీసుల్లో

రఘరామకు సిట్ నోటీసుల్లో


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు అనేక మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ముగ్గురు మధ్యవర్తులు నిందితులుగా వారి సంబంధాల పై విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసు విచారణ బాధ్యతలను ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి అప్పగించారు. సిట్ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను విచారణ చేస్తూ..బయటకు వచ్చిన అంశాల ఆధారం గా ముందుకు వెళ్తోంది. కొంత మందికి నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగా ఎంపీ రఘురామ రాజుకు సిట్ నోటీసులు ఇచ్చింది. అందులో 41-ఏ సీఆర్పీసీ కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. అందులో ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించింది.

విచారణకు రఘురామ హాజరయ్యేనా

విచారణకు రఘురామ హాజరయ్యేనా


రఘురామ వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నా..ఆ పార్టీ నేతలతో మాత్రం రాజకీయంగా పోరాటం చేస్తున్నారు. రఘురామ పైన కేసు నమోదు తరువాత ఆ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. చాలా రోజులుగా ఢిల్లీ కేంద్రంగానే రఘురామ తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపైన విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. ఇక, ఇప్పుడు ఎమ్మెల్యేల ఎర కేసులో విచారణ ఎదుర్కొంటున్న వారితో రఘురామ ఫొటోలు కొన్ని బయట సర్క్యులేట్ అవుతున్నాయి. అదే సమయంలో ఏపీ సీఎం జగన్ కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నా..అక్కడ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు జరిగిన ప్రయత్నాలు ఈ ముగ్గురు వివరించిన అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. తమ టార్గెట్ లో ఏపీ ప్రభుత్వం కూడా ఉందంటూ ఈ ముగ్గురు వీడియోలో సింహయాజీ చెప్పిన మాటలు ఉన్నాయి.

రాజకీయంగా కొత్త మలుపులు

రాజకీయంగా కొత్త మలుపులు


ఇక, రఘురామకు బీజేపీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు తమ పార్టీకి చెందిన బీఎల్ సంతోష్ తో పాటుగా పార్టీని టార్గెట్ చేస్తూ జరుగుతున్న ప్రచారం పైన బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా ఉంది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆ ముగ్గురితో ఎటువంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రఘరామ తనకు నోటీసులు అందితే ఏం చేయాలో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. కానీ, ఈ మెయిల్ ద్వారా ..ఢిల్లీలోని నివాసానికి కూడా నోటీసులు పంపినట్లు చెబుతున్నారు. ఈ కేసులో విచారణ విషయంలో అటు బీజేపీ ..ఇటు టీఆర్ఎస్ నుంచి రఘురామ రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనేది విచారణ తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అడుగులు కీలకంగా మారనున్నాయి.

English summary
SIT Issues notices to YCP Rebel MP Raghu Rama Raju in mlas poaching case, now it became political discussion in AP and Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X