పేపర్ బాయ్ గా టీడీపీ ఎమ్మెల్యేల నిమ్మల - నెక్స్ట్ అదీ చేస్తానంటూ..!!
టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు కొత్త అవతారమెత్తారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ.. 2019 ఎన్నికల్లో ఆ జిల్లాలో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అందులో పాలకొల్లు నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు ప్రతిపక్ష నేతగా కీలకంగా మారారు. వైసీపీ ప్రభుత్వం పైన శాసనసభలో..బయటా పలు అంశాల పైన నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా, ఎమ్మెల్యే నిమ్మల పేపర్ బాయ్ అవతారం ఎత్తారు.
పేపర్ బాయ్ గా మారిన ఎమ్మెల్యే
ఉదయం వేళ పాలకొల్లు పట్టణంలో తన సైకిల్ పైన దిన పత్రికలను తీసుకొని, స్థానిక పేపర్ బాయ్స్ తో కలిసి ఇంటింటి దిన పత్రికలు అందించారు. వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు ప్రభుత్వం పేరుతో వెళ్తున్న సమయంలో..ఆయన దీనికి కౌంటర్ గా ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఎంచుకున్నారు.
టిడ్కో ఇళ్లల్లో మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి వాటిని పంపిణీ చేయటంతో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని లబ్దిదారులకు వివరించేందుకు పేపర్ బాయ్ గా వారి వద్దకు వెళ్లారు. పేపర్లు వేస్తున్న వారికి.. పత్రికలు కొనుగోలు చేయటానికి వచ్చిన వారికి పట్టణానికి పది కిలో మీటర్ల దూరంలో కేటాయింపు చేయటం గురించి వివరించారు.
ప్రతీ నెలా ఇలా కొనసాగిస్తానంటూ
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు ప్రతీ నెలా నాలుగు రోజులు పాటు ఇలా పేపర్ బాయ్ గా ఉంటూ.. ప్రజల మధ్యకు వెళ్తానని రామానాయుడు స్పష్టం చేసారు. అదే విధంగా మరో నాలుగు రోజులు పారిశుధ్ద్య పనులు చేపడుతూ నిరసనకు దిగుతానని రామానాయుడు వెల్లడించారు. గతంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాల పైన పోరాటంలో భాగంగా సైకిల్ యాత్రలు చేశారు. రైతుల సమస్యలపై ఉరితాడుతోనూ అనుచరులతో కలిసి నిరసనలు చేపట్టారు. రోడ్ల పరిస్థితిపైన ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రోడ్డు పైన ఏర్పడిన గుంతల్లో చేపలు పడుతూ నిరసన వ్యక్తం చేసారు. అదే విధంగా.. ట్రాక్టర్లు నడుపుతూ ఆయన గతంలో నిరసనకు దిగారు.

వినూత్న నిరసనలతో నిమ్మల
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కల్తీ మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాళిబొట్లతో గతంలో రామానాయుడు నిరసన వ్యక్తం చేశారు. పేదలకు ఉచితంగా అన్నదానం చేస్తున్న షెడ్డును తొలగించడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే నిమ్మల రాత్రంత రోడ్డు పైనే ఆ షెడ్డు వద్దే నిద్రంచి నిరసన తెలిపారు. ఇలా.. నిరసనలు తెలియచేయటంలో ప్రజలతో కలిసి పోయే విధంగా వ్యవహరించే రామానాయుడు..ఇప్పుడు పేపర్ బాయ్ గా తన సొంత నియోజకవర్గంలో తిరుగుతూ ఆసక్తి కర చర్చకు కారణమయ్యారు.












Click it and Unblock the Notifications