'బాబు వస్తే జాబు వస్తుందనుకున్నాం.. లోకేష్‌కు ఎమ్మెల్సీ వస్తుందనుకోలేదు'
బాబు వస్తే జాబు వస్తుందంటే ఏమో అనుకున్నామని.. కానీ చంద్రబాబు వాళ్ల బాబు లోకేష్ కు ఎమ్మెల్సీ సీటు వస్తుందని అనుకోలేదని ఎద్దేవా చేశారు.
విజయవాడ: ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షం వైసీపీ పెదవి విరుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల మీద ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను సీఎం చంద్రబాబు నెరవేర్చడం లేదని రోజా మండిపడ్డారు. ఉద్యోగాల కల్పనలో విఫలమైతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ హామిని గాల్లో కలిపేసిందని విమర్శించారు.

బాబు వస్తే జాబు వస్తుందంటే ఏమో అనుకున్నామని.. కానీ చంద్రబాబు వాళ్ల బాబు లోకేష్ కు ఎమ్మెల్సీ సీటు వస్తుందని అనుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రతీ బడ్జెట్ లో రెండు లక్షల ఇళ్లు కేటాయిస్తామని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం.. బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం అందుకు నిధులు కేటాయించడం లేదని నిలదీశారు.
రాష్ట్రంలో మహిళారక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, బడ్జెట్ లోను కేటాయింపులు జరపలేదని అన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ అని చెప్పి చంద్రబాబు మహిళలను మభ్యపెడుతున్నారని రోజా స్పష్టం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications