రెచ్చగొడుతున్నావా? నన్ను చంపాలని కుట్ర: చంద్రబాబుపై భగ్గుమన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటనలు చేస్తున్నారు. జగన్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు పర్యటనలకు రాష్ట్ర ప్రజల నుంచి విశేషంగా మద్దతు లభిస్తుంది. తాజాగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించారు. రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రోడ్ షో నిర్వహించి జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

అనంతపురం జిల్లాలో జగన్ సర్కార్ పై విరుచుకుపడిన చంద్రబాబు
అనంతపురం జిల్లాలో చంద్రబాబు మాట్లాడుతూ అసెంబ్లీలో తన పై వ్యక్తిగత దూషణలు చేశారని సభను మళ్లీ గౌరవ సభ గా మార్చిన తర్వాత సభకు వెళతానని శపధం చేసి బయటకు వచ్చానని పేర్కొన్నారు. హంద్రీనీవా కాలువ పనులు ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు. హంద్రీనీవాపై సీఎం జగన్ గాలి మాటలు చెప్పలేదా అంటూ నిలదీశారు. తమ పాలనలో రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేసే ప్రయత్నం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ను పూర్తిగా ఆపేశానంటూ చంద్రబాబు ఆరోపించారు. అనంతపురం జిల్లాలో వేరుశెనగ రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రావడంలేదని ఇన్సూరెన్స్ ఇవ్వడంలేదని చంద్రబాబు పేర్కొన్నారు. రైతుల సమస్యలను గాలికొదిలేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వెల్లడించారు.

చంద్రబాబు వాగుడే వాగుడు .. రాయలసీమలో సీట్ల కోసం ఫ్యాక్షన్ ఉన్మాదిగా బాబు
ఇక చంద్రబాబు పర్యటన పై వైయస్సార్సీపి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వాగుడే వాగుడు కార్యక్రమం చేపట్టారని ఆయన ప్రజలకు ఏం చేశాడో చెప్పకుండా ఏదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమలో సీట్ల కోసం రక్తపాతం సృష్టించి ఫ్యాక్షన్ ఉన్మాదిగా చంద్రబాబు మారారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విరుచుకుపడ్డారు. 2014- 2019 మధ్యలో ఎన్ని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు? ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో చూసుకోవాలంటూ హితవు పలికారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడిన ఎమ్మెల్సే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
గత మూడు నెలల్లో 7హత్య కేసులు నమోదైతే చేసిందంతా తెలుగుదేశం పార్టీ నాయకులని, హత్యకు గురైంది మాత్రం వైసిపి నాయకులు అని పేర్కొన్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అధికారం లేకపోతే బ్రతకలేను అనే విధంగా చంద్రబాబు ప్రవర్తించవద్దని హితవు పలికారు. చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను వర్గాలుగా విడగొట్టి ఓట్లు పొందాలని కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు తీరుపై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రక్తం పారించిన చరిత్ర మీది.. నీరు పారించిన చరిత్ర మాది అంటూ ఫైర్
నాడు చంద్రబాబు ప్రైవేటు సైన్యాలతో దాడులు చేయించారని, తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని అంతమొందించడానికి కుట్రలు చేశారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. రక్తం పారించిన చరిత్ర చంద్రబాబుది అయితే నీరు పారించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆయన నైజం బయటపడిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాల పాటు రక్తం పారిన ప్రాంతంలో తాము నీళ్లు పారించామని, మూడు రిజర్వాయర్ ల కు శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.

ఇది చాలదా నిన్ను ఆర్థిక ఉన్మాది అనడానికి
రాప్తాడు పై సవతి తల్లి ప్రేమ చూపించింది నువ్వు కాదా అంటూ నిలదీశారు. ప్రజలను పౌరుషం గా పోరాడాలని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి మండిపడ్డారు. కాగ్ తన నివేదికలో చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం దివాలాకు గురైందని పేర్కొందని తోపుదుర్తి ఆరోపించారు. రాష్ట్రాన్ని దివాలా తీయించి వెళ్ళిపోయావు అంటూ మండిపడిన తోపుదుర్తి ఇది చాలదా నిన్ను ఆర్థిక ఉన్మాది అనడానికి అంటూ చంద్రబాబుపై విరుచు
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం











Click it and Unblock the Notifications