మాధవరెడ్డి పేరెత్తగానే పెడబొబ్బలు పెడుతున్నావ్; ఆస్కార్ లెవల్ యాక్షన్: రివెంజ్ తీర్చుకున్న వల్లభనేని వంశీ

టీడీపీ అధినేత చంద్రబాబును, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని టార్గెట్ చేసి వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేశారని లబోదిబోమంటున్న చంద్రబాబుకు వైసీపీ నేతలు చురకలు అంటిస్తూ ఉన్నారు. మీకు కుటుంబాలు ఉంటాయి. మీకు గౌరవం ఉంటుంది. మాకు కుటుంబాలు, గౌరవమూ లేదా అని ప్రశ్నిస్తున్నారు. నిన్నటికి నిన్న భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవడం పై నగరి ఎమ్మెల్యే రోజా, కొడాలి నానీ చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

Recommended Video

    Chandrababu ఏడుపు నటన - Vamsi దిగజారుడు రాజకీయాలు | Lokesh పుట్టుక గురించి || Oneindia Telugu
    చంద్రబాబు ఏడుపును టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు

    చంద్రబాబు ఏడుపును టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు

    మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది బాబు అంటూ ఎద్దేవా చేశారు. గతంలో అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసి రోజా భావోద్వేగానికి గురయ్యారు. రోజా బ్లూ ఫిల్మ్ లో నటిస్తుంది అంటూ పీతల సుజాత తో అసెంబ్లీ వద్ద చెప్పినప్పుడు మా కుటుంబాలు లేవా? మాకు గౌరవం లేదని మండిపడిన రోజా, ఇప్పుడు చంద్రబాబుకు, ఆయన కుటుంబానికి జరిగిన అవమానం అంటూ ప్రశ్నించారు.

    ఇక ఇదే సమయంలో వల్లభనేని వంశీ సైతం చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబు గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చాడు అని, ఇదంతా ప్రీ ప్లాన్డ్ డ్రామా అని మండిపడ్డారు కొడాలి నాని. చంద్రబాబు ఏడుపును నటన అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

    పదవి కోసం జయప్రదంగా చంద్రబాబు నటిస్తున్నాడు : వల్లభనేని వంశీ

    పదవి కోసం జయప్రదంగా చంద్రబాబు నటిస్తున్నాడు : వల్లభనేని వంశీ

    గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పదవి కోసం జయప్రదంగా అద్భుతంగా నటిస్తున్న చంద్రబాబు అంటూ చంద్రబాబును టార్గెట్ చేస్తూ మండిపడుతున్నారు . మాధవ రెడ్డి పేరెత్తగానే పెడబొబ్బలు పెడుతున్నావ్ అంటూ ఎద్దేవా చేశారు. మరి నీ పుత్రరత్నం పప్పు నాయుడు మమ్మల్నందర్నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు నీ పెద్దరికం ఏమైంది ? నీ ఇంగిత జ్ఞానం ఏమైంది అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబును ప్రశ్నించారు.

     ఆస్కార్ లెవల్లో యాక్షన్ చేస్తున్నావ్ .. ఆపు నీ నటన

    ఆస్కార్ లెవల్లో యాక్షన్ చేస్తున్నావ్ .. ఆపు నీ నటన

    చంద్రబాబు మా అందరి కుటుంబాలు కావా? మాకు గౌరవం లేదా? మావి సంసారాలు కాదా? అంటూ నిలదీశారు. మా భార్య పిల్లలు మా పై వస్తున్న అనుచిత విమర్శలను చూసి బాధపడరా అంటూ వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ఊరికే ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని పెద్దలు చెబుతుంటారు.. అది నీ లాంటి వాడిని చూసే చెప్పి ఉంటారు అంటూ చంద్రబాబు ని టార్గెట్ చేసిన వల్లభనేని వంశీ నిన్ను పల్లెత్తు మాట అంటే ఆస్కార్ లెవల్లో యాక్షన్ చేస్తున్నావ్. ఆస్కార్ జ్యూరీ వాళ్ళు నీ నటన చూసి ఆస్కార్ అవార్డు నీకు పోస్టుల పంపిస్తారు లే ఇంకా ఆపు నీ నటన అంటూ చంద్రబాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు వల్లభనేని వంశీ.

     పట్టాభి వ్యాఖ్యల రగడ టైంలో మాధవరెడ్డి పేరుతో వంశీ తీవ్ర వ్యాఖ్యలు

    పట్టాభి వ్యాఖ్యల రగడ టైంలో మాధవరెడ్డి పేరుతో వంశీ తీవ్ర వ్యాఖ్యలు

    గతంలో కూడా వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సమయంలో టిడిపిని టార్గెట్ చేస్తూ ఘాటుగా స్పందించారు. లోకేష్ గురించి విమర్శలు చేసిన సమయంలో వల్లభనేని వంశీ ఎలిమినేటి మాధవ రెడ్డి పేరు బయటకు తీసి లోకేష్ తల్లి భువనేశ్వరిపై పరిధి దాటి మాట్లాడారు. లోకేష్ పుట్టుక గురించి అందరికీ తెలుసు అంటూ ఘాటుగా విమర్శించారు.

    ఏడ్చిన చంద్రబాబును వదిలిపెట్టని వైసీపీ నేతలు

    ఏడ్చిన చంద్రబాబును వదిలిపెట్టని వైసీపీ నేతలు

    ప్రస్తుతం శుక్రవారం రోజు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలలోనూ ఎలిమినేటి మాధవరెడ్డి పేరెత్తగానే చంద్రబాబు నాయుడు తన కుటుంబాన్ని అవమానిస్తున్నారంటూ సభ నుంచి బాయ్ కాట్ చెయ్యటమే కాకుండా, పెద్దపెట్టున ఏడ్చి అసలేం జరిగింది అన్న చర్చకు కారణమయ్యారు. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏడ్చిన తరువాత కూడా టార్గెట్ చేసిన వల్లభనేని వంశీ మరోమారు నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై రివెంజ్ తీర్చుకున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబు ఏడుపు ఓ నటన అంటూ సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+