వైయస్ జగన్ పార్టీలోకి కాంగ్రెసు ఎమ్మెల్యే జంప్

ఆయన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెసు పార్టీ అవమానపరిచిందని, సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని తాను నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు.
నిజానికి నిరుడు జులై 30వ తేదీననే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాననిి, అయితే బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ప్రజల వెనక ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్నాళ్లూ ఆగానని ఆయన చెప్పారు. ఆదివారంనాడు ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు.
మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు ధర్మాన ప్రసాద రావు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆయనకు కూడా 9వ తేదీనే ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications