జగన్‌కు ‘తూర్పు’లో ఝలక్!: నేడు సైకిలెక్కనున్న వైసీపీ తొలి ఎమ్మెల్సీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వైసీపీ అధినేత వైయస్ జగన్‌కి తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం భారీ ఎదురుదెబ్బ తలగనుంది. వైసీపీ నుంచి తొలి ఎమ్మెల్సీగా పదవి దక్కించుకున్న ఆదిరెడ్డి అప్పారావు ఈరోజు చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు. ఇప్పటివరకు విడతల వారీగా టీడీపీ నేతల్లో జరిగిన చర్చల్లో టీడీపీ అధినేత, ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విషయానికి వస్తే టీడీపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగారు. ఆ పార్టీకి 18 ఏళ్లపాటు తన సేవలనందించారు. వైయస్ జగన్ వైసీపీని స్ధాపించిన అనంతరం ఆయన వైసీపీలో చేరారు. ఆ తర్వాత తనను నమ్మి పార్టీలోకి వచ్చిన ఆదిరెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చిన జగన్ ఆయనకు మంచి ప్రాధాన్యమే ఇచ్చారు.

2013లో వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆదిరెడ్డి భార్య వీరరాఘవమ్మ రాజమండ్రి మేయర్‌గా పనిచేశారు. శ్రీకాకుళం మాజీ ఎంపీ, దివంగత టీడీపీ నేత కింజారపు ఎర్రన్నాయుడికి ఈయన స్వయాన వియ్యంకుడు. బీసీ వర్గానికి చెందిన నేతగా తూర్పు గోదావరి జిల్లాలో ఆదిరెడ్డికి మంచి పేరుంది.

ఆదిరెడ్డి టీడీపీలో చేరే విషయమై గురువారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పటిష్టత కోసం కష్టపడేవారికి వైసీపీలో విలువ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కష్టపడేవాళ్లతో పాటు పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేసేవారిని పార్టీలో విలువే లేదని ఆయన పేర్కొన్నారు.

MLC Adireddy Apparao comments on Ysrcp

విలువ ఇవ్వని పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఏం లాభమని కూడా ఆయన తనకు దక్కిన ప్రాధాన్యంపై పార్టీ అధినేత వైయస్ జగన్‌కు సూటి ప్రశ్న సంధించారు. ''విలువ ఇవ్వనప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తే మాత్రం ఏం లాభం?'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు ఇప్పటికే వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి అప్పారావు కూడా తన సొంత పార్టీ వైపే మొగ్గు చూపారు. నిజానికి టీడీపీలో ఆదిరెడ్డి ఎప్పుడో చేరాల్సి ఉన్నా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభ్యంతరం తెలిపారు.

చంద్రబాబు ఒత్తిడితో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మెత్తబడటంతో ఆదిరెడ్డి చేరికి లాంఛనమైంది. శుక్రవారం రాజమహేంద్రవరం నుంచి 100 బస్సులు, 150 కార్లలో భారీ అనుచరగణంతో విజయవాడకు బయలుదేరనున్న ఆదిరెడ్డి అప్పారావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MLC Adireddy Apparao comments on Ysrcp.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి