• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ysrcp: పోస్టుమార్టం రిపోర్టుపై MLC అనంత‌బాబు భ‌విష్య‌త్తు??

|
Google Oneindia TeluguNews

త‌న కారు మాజీ డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యంను హ‌త్య‌చేసిన ఎమ్మెల్సీ అనంత‌బాబు భ‌విష్య‌త్తు పోస్టుమార్టం రిపోర్టుపై ఆధార‌ప‌డివుంది. పోలీసుల‌కు అనంత‌బాబు ఇచ్చిన వాంగ్మూలం ప్ర‌కారం రెండుసార్లు సుబ్ర‌మ‌ణ్యాన్ని వెన‌క్కి నెట్ట‌డంతో గాయ‌ప‌డి చ‌నిపోయాడ‌ని చెప్పారు. ఈ మ‌ర‌ణాన్ని రోడ్డు ప్ర‌మాదంగా చిత్రీక‌రించేందుకు మ‌ర‌ణించిన వ్య‌క్తిని కింద‌ప‌డేసి క‌ర్ర‌తో కొట్టిన‌ట్లు చెప్పారు.

Recommended Video

  Vikram Movie Genuine Review | Telugu Oneindia
   ప‌థ‌కం ప్ర‌కార‌మే హ‌త్య చేశారు.. బంధువుల ఆరోప‌ణ‌

  ప‌థ‌కం ప్ర‌కార‌మే హ‌త్య చేశారు.. బంధువుల ఆరోప‌ణ‌


  అయితే సుబ్ర‌మ‌ణ్యం బంధువులు మాత్రం ఒక ప‌థ‌కం ప్ర‌కార‌మే అనంత‌బాబు హ‌త్య‌చేశార‌ని ఆరోపిస్తున్నారు. సుబ్ర‌మ‌ణ్యం మృత‌దేహంపై ర‌క్తం అయిన గాయాలు, క‌మిలిన గాయాలు ఉన్నాయ‌ని పోస్టుమార్టంలో గుర్తించారు. అయితే ఈ గాయాలు సుబ్ర‌మ‌ణ్యం మ‌ర‌ణించ‌డానికి ముందు గాయాలా? మ‌ర‌ణించిన త‌ర్వాత గాయాలా? అనేది తేలాలంటే పోస్టుమార్టం నివేదిక అందిన త‌ర్వాతే స్ప‌ష్ట‌త రానుంది.

   గొడ‌వ దృశ్యాల‌న్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తం?

  గొడ‌వ దృశ్యాల‌న్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తం?


  సుబ్ర‌మ‌ణ్యం కుటుంబ స‌భ్యుల‌తో అనంత‌బాబు గొడ‌వ ప‌డిన దృశ్యాలు కాకినాడ రామారావుపేట‌లోని శ్రీ‌రామ్ బ‌గీచ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల్లో నిక్ష్లిప్త‌మ‌య్యాయి. కానీ వాటిని బ‌య‌ట‌కు రాకుండా నిందితులు జాగ్ర‌త్త‌ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కారులో సుబ్ర‌మ‌ణ్యం మృత‌దేహాన్ని అపార్ట్‌మెంట్ ద‌గ్గ‌ర‌కు తెచ్చిన అనంత‌బాబు జి.మామిడాడ‌లో అంత్య‌క్రియ‌లు చేయాల‌ని బెదిరించారంటూ సుబ్ర‌మ‌ణ్యం కుటుంబీకులు, ప్ర‌త్య‌క్ష సాక్షులు పోలీసులకు తెలిపారు.

   క‌ర్ర‌తో కొట్టి తాళ్ల‌తో క‌ట్టేసి కారు ఎక్కించారు

  క‌ర్ర‌తో కొట్టి తాళ్ల‌తో క‌ట్టేసి కారు ఎక్కించారు


  అనంత‌బాబు పోలీసుల‌కు ఇచ్చిన వాంగ్మూలం ప్ర‌కారంప్ర‌మాదంగా చిత్రీక‌రించే క్ర‌మంలో సుబ్ర‌మ‌ణ్యాన్ని క‌ర్ర‌తో కొట్టి, తాళ్ల‌తో క‌ట్టేసి కారు ఎక్కించి తీసుకువెళ్లిన‌ట్లు చెప్పారు. అయితే మ‌రికొంద‌రితో క‌లిసి కొట్టి చంపేశార‌ని బంధువులు ఆరోపిస్తున్నారు. కీల‌కమైన ఈ రెండు విష‌యాల‌పై పోలీసుల ఒక స్ప‌ష్ట‌త‌కు రావాల్సి ఉంది.

   పేరు పెట్టి పిలిచినా చలనం లేదు

  పేరు పెట్టి పిలిచినా చలనం లేదు

  కాకినాడలోని అమృత ఎమర్జెన్సీ అండ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎనస్తీషియా డాక్టర్ శ్రవణ్ కుమార్ సుబ్రమణ్యాన్ని పరీక్షించారు. అర్థరాత్రి ఒకటిన్నర గంట తర్వాత కారులో ఒక పేషెంట్ ను తెచ్చారంటూ క్యాజువాలిటీలో డ్యూటీలో ఉన్న నర్సు శరణ్య ఫోన్ చేశారు. ఆ కారు ఆసుపత్రి ఎదుట రోడ్డుపై ఉందని, దానిమీద ఎమ్మెల్సీ స్టిక్కరుందని, తెలుపురంగు ఐ20 కారని, అందులో పేషెంట్ వెల్లకిలా పడుకోబెట్టి ఉన్నారని డాక్టర్ శ్రవణ్ కుమార్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వచ్చినవారేమో ప్రమాదం జరిగిందని చెప్పారని, పేషెంట్ ను పరిశీలిస్తే చలనం లేదని, అతని పేరు తెలుసుకొని పిలిచినా చలనం లేదని.. కారు వెనక సీటులో ఉంచే ఈసీజీ తీయిస్తే పల్స్ స్ట్రెయిట్ లైన్ హెయిర్ రేట్ సున్నా వచ్చిందని, ప్రాణం లేదని అనిపిస్తోందని, ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లమని సలహా ఇచ్చినట్లు డాక్టర్ శ్రవణ్ కుమార్ పోలీసుల విచారణలో వెల్లడించారు.

  English summary
  Anantha Babu's future on postmortem report ??
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X