హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ తమిళసై వ్యాఖ్యలకు కవిత కౌంటర్

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. వీటికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. దీనిపై ట్విటర్ వేదికగా కవిత స్పందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టామీదకన్నా దేశ మౌలిక సదుపాయాలమీద దృష్టిపెడితే బాగుండేదన్నారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే తాము పోరాడుతున్నామన్నారు. జనవరి 26 లాంటి ప్రత్యేకమైన రోజున, సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అని సెటైర్ వేశారు.

రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ తమిళసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLC Kavitha counters governor Tamilisai over her republicday speech-here is all

రాష్ట్రంలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే కొత్తగా భవనాలను నిర్మించడం కాదని ఫౌమ్ హౌస్ లు కట్టడం, మన పిల్లలు విదేశాల్లో చదవడం అభివృద్ధి కాదన్నారు. రాష్ట్రంలోని విద్యాలయాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఉండాలని, తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టేలా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. తెలంగాణలో తనకున్న బంధం మూడు సంవత్సరాలది కాదని, పుట్టుకతోనే తనకు అనుబంధం ఉందన్నారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చని, కానీ నాకు తెలంగాణ ప్రజలంటే ఇష్టమని, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పేర్కొన్నారు.

MLC Kavitha counters governor Tamilisai over her republicday speech-here is all
English summary
Governor KCR, who participated in the Republic celebrations, criticized the government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X