Gautam adani case: మౌనం వీడి మోదీని సూటిగా ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు అయ్యి తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మౌనం వహించారు .ఇంతకాలం సైలెంట్ గా ఉన్న కవిత తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ చేశారు. ప్రస్తుతం దేశంలో గౌతమ్ అదాని లంచం మరియు మోసం ఆరోపణలతో యూఎస్ లో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం పైన ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
అదానీ కేసుపై ఎమ్మెల్సీ కవిత స్పందన
ఇప్పటికే గౌతమ్ అదాని కేసులో సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక గౌతమ్ అదాని అరెస్టు కాకుండా మోడీ అడ్డుకుంటున్నారని, ఆదానికి మోడీ రక్షణగా ఉంటున్నారని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గౌతమ్ అదానీ వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అఖండ భారతంలో అదానికో న్యాయం? ఆడబిడ్డకో న్యాయమా?
ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన కవిత అఖండ భారతంలో అదానికో న్యాయం? ఆడబిడ్డకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ అయిందని, ఆధారాలు ఉన్నా అదానీని మాత్రం అరెస్టు చేయడం కష్టమా అంటూ ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆయనపై ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆయన వైపేనా అంటూ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా మోదీ సర్కార్ ను టార్గెట్ చేశారు.
తీవ్ర ఆరోపణలు వస్తున్నా అదానీ మాత్రం స్వేచ్చగా .. ఎలా ?
మోదీ ప్రభుత్వం అఖండ భారతాన్ని ప్రచారం చేస్తుంది కానీ న్యాయం విషయంలో సెలెక్టివ్ జస్టిస్ ను అందిస్తారని కవిత టార్గెట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను సాక్షాలు లేకుండా అరెస్టు చేసి నెలల తరబడి విచారణ చేస్తారని, అయితే గౌతమ్ అదానీ పై పదే పదే మరియు తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనను స్వేచ్ఛగా తిరగనిస్తారని ఆమె ఎద్దేవా చేశారు .
తన అరెస్ట్ తో లింక్ పెట్టి అదానీ విషయంలో మోదీపై కవిత
కేంద్ర ప్రభుత్వాన్ని ఆదానిపై చర్య తీసుకోకుండా ఆపేది ఏమిటి అంటూ కవిత ఎక్స్ వేదికగా ప్రధాని మోదీని, భారత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మొత్తానికి కొన్ని నెలల మౌనాన్ని వదిలిపెట్టి ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా మోడీ సర్కార్ పై విమర్శనాస్త్రాలు చేశారు. అదానీ విషయంలో మోదీ సర్కార్ తీరును తన కేసుతో లింక్ పెట్టి గట్టిగానే ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications