ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ షురూ..! టీడీపీలో చేరబోతున్న ఎమ్మెల్సీ

విజయవాడ : గత కొద్దిరోజులుగా చడీ చప్పుడు లేకుండా పోయిన ఆపరేషన్ ఆకర్ష్ సెకండ్ ఇన్నింగ్స్ మళ్లీ మొదలైనట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో తమ ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా ఫిరాయింపు చోటు చేసుకోబోతుండడం గమనార్హం.

ఏపీలో ఇప్పటిదాకా జరిగిన పార్టీ ఫిరాయింపులన్నీ వైసీపీ నుంచి జరిగినవే. ఇక తాజా ఫిరాయింపు విషయానికొస్తే.. కర్నూల్ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్సీ సుధాకర్ బాబు టీడీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఇదే విషయంపై తన అనుచరులతో సంప్రదింపులు జరిపి పార్టీ మారే తేదీని తెలియజేస్తానని సుధాకర్ వెల్లడించారు.

MLC Sudhakar Babu Joining in TDP

మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డికి ముఖ్య అనుచరుడైన సుధాకర్‌ బాబు.. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాగా, తన పనితీరును గుర్తించి పార్టీలోకి రావాలని చంద్రబాబు ఆహ్వానించినందు వల్లే తాను పార్టీ మారబోతున్నట్లుగా తెలిపారు సుధాకర్ బాబు.

రేపో.. మాపో.. టీడీపీలో సుధాకర్ బాబు చేరికపై స్పష్టత రానుండగా.. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న సుధాకర్ బాబు లాంటి నేత పార్టీని వీడడం కాంగ్రెస్ ను మరింత సంకట స్థితిలోకి నెట్టనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+