అమెరికాలో కమ్మ-రెడ్డి క్రికెట్ మ్యాచ్ ఏమయిందంటే..: కట్జూ ట్వీట్
న్యూఢిల్లీ/విజయవాడ: మార్కండేయ కట్జూ మూడు రోజుల క్రితం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు నెట్లో వైరల్ అయింది. అమెరికాలో కొద్ది రోజుల క్రితం రెడ్డి టాం - కమ్మ టీం మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగిందని, కాసేపు ఆట బాగానే జరిగిందని, ఆ తర్వాత ఏదో చిన్న విషయమై ఘర్షణ చోటు చేసుకుందని, దీంతో మధ్యలోనే మ్యాచ్ రద్దు చేసుకొని వెళ్లిపోయారని పేర్కొన్నారు.
ఇలా రాస్తూ.. ఆయన విమర్శలు కూడా చేశారు. అమెరికాలో కూడా వీళ్లకు కులమేనా, కులాల వారీగా క్రికెట్ ఆడటమా, అందులోను ఘర్షణా, వేలాది కిలోమీటర్లు పోయి ఓ అగ్రరాజ్యంలో నివసిస్తూ ఇంకా కులమే ప్రధానమైందా అని తిట్టిపోశారు.
Casteism in America pic.twitter.com/sdsJhCz6KA
— Markandey Katju (@mkatju) April 10, 2017
ఈ విషయం విని తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. 13,500 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ కూడా వారు తమ కులం గురించి మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. నేను గతంలో 90 శాతం ఇండియ్స్ ఫూల్స్ అని చెప్పానని, అది కరెక్ట్ అనిపించడం లేదా అన్నారు.












Click it and Unblock the Notifications