జనం తీర్పు: కామాంధుడిని కొట్టి చంపారు (ఫోటోలు)
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలికపై లైంగికదాడి చేయడమేగాగ హత్యకు కూడా పాల్పడిన కామాంధుడిని ప్రజలు కొట్టి చంపిన ఘటన ఏలూరు మండలం మాదేపల్లిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం ఏలూరు మండలం వెంకటాపురం ఇందిరాకాలనీకి చెందిన తియ్యాల రమేశ్, అనురాధ దంపతులకు ఏడేళ్ల కుమార్తె లావణ్య ఒకటవ తరగతి చదువుతుంది. సోమవారం ఆ పాప కోడిగుడ్లు తేవడానికి దుకాణానికి వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాలేదు.
చుట్టుపక్కల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎదురింట్లో ఉన్న సురేశ్ అనే వ్యక్తిపై అనుమానం వచ్చి అడిగాడు. బతిమాలాడు. సొమ్ములిస్తామని వేడుకున్నాడు.
అయినా అతను చెప్పలేదు. సురేశ్ అప్పటికే కొన్ని లైంగిక దాడి కేసుల్లో నిందితుడు. అనుమానం బలపడటంతో సురేశ్‌పై లావణ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం సురేశ్ ఇంట్లో ట్రంకు పెట్టె నుంచి దుర్వాసన రావడంతో అతడి తండ్రి వెంకటేశ్వరరావు ఆ పెట్టెను తెరిచి చూడగా లావణ్య మృతదేహం కనిపించింది.

కామాంధుడిని కొట్టి చంపారు
పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి సురేశ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దారిలో సురేశ్ ఓ ప్లైఓవర్‌పై నుంచి కిందికి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. శుక్రవారం పోలీసుల అదుపులో ఉన్న సురేశ్‌ను స్ధానిక ప్రజలు జీపులోంచి లాగి దాడి చేశారు.

కామాంధుడిని కొట్టి చంపారు
నిందితుడిపై పిడిగుద్దులు కురిపించారు. కాళ్లతో తన్నారు. ఆ దెబ్బలకు తాళలేక చివరికి ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత స్ధానికులను చెదరగొట్టి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కామాంధుడిని కొట్టి చంపారు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన సైకో సురేష్‌ను స్థానికులు చంపలేదని, అతడే ఆత్మహత్య చేసుకున్నాడని ఏలూరు డీఎస్పీ సరితాదేవి తెలిపారు. జిల్లాలోని ఏలూరు పట్టణం, మాదేపల్లిలో ఏడేళ్ల చిన్నారి లావణ్యపై అత్యాచారం చేసి, హత్య చేసిన సురేష్‌ను స్థానికులు చంపారన్న విషయంపై డీఎస్పీ వివరణ ఇచ్చారు.

కామాంధుడిని కొట్టి చంపారు
పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు సురేష్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె చెప్పారు. అతడు చనిపోయిన అనంతరం ఆగ్రహంతో ఉన్న స్థానికులు అతడి మృతదేహంపై దాడిచేశారని డీఎస్పీ చెప్పారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడే సమయంలో డీఎస్పీ సరితాదేవి కన్నీటి పర్యంతమయ్యారు.

కామాంధుడిని కొట్టి చంపారు
అభం శుభం తెలియని చిన్నారిని అంతదారుణంగా చంపడం చాలా హేయమైన చర్య అన్నారు. తన సర్వీసులో ఇలాంటి ఘోరాన్ని చూడలేదన్నారు. ముక్కు పచ్చలారని ఓ బాలికపై అత్యాచారం జరిపి, ఆమెను చంపి శవాన్ని బీరువాలో దాచిపెట్టిన కామాంధుడు సురేష్‌ను ప్రజలు ఆగ్రహంతో హత్య చేశారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications