టీలో మొబైల్ హార్డ్‌వేర్ ఇండస్ట్రీ: కేసీఆర్, ఐటీ వార్షిక నివేదిక రిలీజ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని మొబైల్ హార్డ్ వేర్ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం తెలిపారు. కేసీఆర్‌తో ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్ భేటీ అయింది.

రాష్ట్రంలో మొబైల్ తయారీ పరిశ్రమల సముదాయం ఏర్పాటు అంశంపై ప్రభుత్వం, మొబైల్ యజమానుల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. దేశంలో మొబైల్ తయారీ రంగంలో హైదరాబాదును అగ్రగామిగా నిలబెడతామన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు సమగ్ర నివేదిక ఇవ్వాలని పారిశ్రామికవేత్తలను కేసీఆర్ కోరారు. పరిశ్రమలకు అవసరమైన స్థలం, సదుపాయాలు కల్పించాలన్నారు. సెల్ ఫోన్ సంస్థలకు భూములు కేటాయించేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు.

Mobile Hardware industry in Telangana: KCR

ఐటీ శాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన కేటీఆర్

ఐటీ శాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీ రామారావు విడుదల చేశారు. ఐటీ ఎగుమతుల్లో గత ఏడాది 15.7 శాతం వృద్ధి సాధించామన్నారు. హైదరాబాదులో ఐటీ ఎగుమతుల విలువ రూ.66,217 కోట్లకు చేరుకుందన్నారు. 2019 నాటికి రూ.1.2 లక్షల కోట్ల మేరకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

గత ఏడాది అదనంగా 50వేల మందికి ఉపాధి కల్పించారన్నారు. సిలికాన్ వ్యాలీలో టీ హబ్ బ్రాంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్త పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. హైదరాబాదులో సైబర్ సిటీ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని, ఇంటింటికి ఇంటర్నెట్ అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+