పుట్టిన రోజు: చంద్రబాబుపై మోడీ ఇలా, కేసీఆర్ కూడా
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 67 వసంతాలు పూర్తిచేసుకుని 68వ ఏట అడుగుపెడుతున్న చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు.
Wishing the industrious CM of AP, @ncbn Garu a very happy birthday. May he lead a long life filled with best health.
— Narendra Modi (@narendramodi) April 20, 2017
చంద్రబాబు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని.. రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచి ఆయన నివాసం వద్ద బారులు తీరారు. టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, వేద పండితులతో పాటు సండ్ర వెంకట వీరయ్య, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ తదితరులు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం అనంతపురం పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
అర్చకుల ఆశీర్వాదం
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా టీటీడీ, కనకదుర్గ, షిరిడీ దేవస్థానం అర్చకులు, వేద పండితులు విజయవాడలో ఆయనను కలిసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం చంద్రబాబును వారు ఆశీర్వదించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!