మోహన్ బాబు 'పద్మశ్రీ' వెనక్కు..తెర వెనుక, అనూహ్య పరిణామాలు..!!
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు పద్మశ్రీ పైన మరోసారి తెర మీదకు వచ్చింది. సమాజసేవ చేసిన వారికి ఇచ్చే పద్మశ్రీని ఎంతోమంది విద్యార్థుల నుండి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న మోహన్‌బాబు పద్మశ్రీ అవార్డుకు తగదని డిమాండ్ చేస్తున్నారు. పద్మశ్రీని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని, మోహన్‌బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అఖిలపక్ష నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
మోహన్ బాబు పద్మశ్రీ అవార్డును వెనక్కు తీసుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేసారు. సమాజ సేవ చేసిన వారికి ఇచ్చే పద్మశ్రీని ఎంతోమంది విద్యార్థుల నుండి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న మోహన్‌బాబుకు ఇవ్వడం తగదన్నారు. తిరుపతి లో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్, కాంగ్రెస్, అఖిలపక్ష నేతలు మాట్లాడారు. సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చక్కగా చూసుకోవాలని, అసాంఘిక శక్తులను అరాచకాలను అణచివేయాలని చెబుతుంటా రని, ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబును కూటమి ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయంపై నోటీసులు ఇచ్చినా మోహన్‌బాబు యూనివర్సిటీ నిర్వాహకులు పట్టించుకోకపోగా ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేసి వారిని అంతమొందించడానికి ప్రయత్నించడం లో మంచు మోహన్ బాబు, మంచు విష్ణుల పాత్ర ఉందని పోలీసులు చెప్పినా ఇప్పటివరకు కేసు నమోదు అయినా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.

అఖిపక్ష నేతల తాజా డిమాండ్
సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి విద్యార్థి సంఘాల నాయకులు కిడ్నాప్ సమయంలో ఎంతో వేగంగా స్పందించిన తిరుపతి జిల్లా ఎస్‌పి, జిల్లా కలెక్టర్ నిందితుల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కోర్టులు పోలీసులను మందలించినా పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. మోహన్ బాబుకు మాజీ ఎంపిగా వస్తున్న పెన్షన్ కూడా నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ విద్యార్థుల కిడ్నాప్‌పై చాలా స్పందిస్తున్నారని, మరోవైపు క్షేత్రస్థాయిలో చూస్తే అటు వైసిపి నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మోహన్ బాబు పుట్టినరోజుకు వెళ్లి బొకేలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం నేరస్తులను ప్రోత్సహించడం కాదా అని విమర్శించారు. మోహన్ బాబు కోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసిందని, మోహన్ బాబు ఆదేశాలతోనే ఈ కిడ్నాప్ జరిగిందని కోర్టుకు పూర్తి సమాచారం పోలీసులు అందించారని వివరించారు.












Click it and Unblock the Notifications