తల్లడిల్లిపోయా: తిరుమల లడ్డూ కల్తీపై మోహన్ బాబు, చంద్రబాబుకు సూచన

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారని వార్తలు తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయానని మోహన్ బాబు అన్నారు. తిరుమల స్వామివారి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపమన్నారు.

ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందువు పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను అని మోహన్ బాబు ఆవేదన వెలిబుచ్చారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు.

Mohan Babu s response on the Tirumala Laddu adulteration case

నిత్యం 'మోహన్ బాబు విశ్వవిద్యాలయం' నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి తనతోపాటు వేల మంది ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు భక్తి పూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని ఆయన తెలిపారు. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

ఇదే నిజమైతే నేరస్థులను శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ఈ కలియుగ దైవం శ్రీనివాసుని ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అని మోహన్ బాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.

తిరుమల లడ్డూ వ్యవహారంలో మోహన్ బాబు తనయుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించారు. లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో మీరెందుకు అనవసర భయాలను వ్యాపింపజేస్తూ, జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని పవన్ ను ప్రకాశ్ రాజ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'ప్రకాశ్ రాజ్.. ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన ఆచారాలను పరిరక్షించే క్రమంలో ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఇందులో మతపరమైన వ్యాఖ్యలు ఎక్కడున్నాయి?' "మీ హద్దుల్లో మీరు ఉండండి" అని ప్రకాశ్ రాజ్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు విష్ణు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+