బతికొస్తుందని ఇంట్లోనే బిడ్డ శవం పెట్టుకున్న తల్లి

మహిళ తన కూతురు పావని మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకుంది. ఆమె తిరిగి బతికొస్తుందనే నమ్మకంతో అలాగే పెట్టుకుంది. మృతదేహం కుళ్లిపోతుండడంతో దుర్వాసన రావడం ప్రారంభించింది. ఇరుగుపొరుగువారు దాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చి మృతదేహాన్ని చిరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి మహిళను ఒప్పించారు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆధునిక కాలంలోనూ ఇటువంటి నమ్మకం కలిగి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది.












Click it and Unblock the Notifications