ఎన్నికల్లో ధనప్రవాహం: నెలరోజుల్లో రూ.4650 కోట్లు సీజ్..రోజుకు రూ.100కోట్లు.. ఏపీలో ఎంతంటే..
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో నగదు, మద్యం ఏరులై పారుతుంది. దేశంలో ఎలక్షన్ కోడ్ మొదలైన నాటి నుండి ఇప్పటివరకు భారీస్థాయిలో నగదు, మద్యం, నగలు పట్టుబడ్డాయి. అంతేకాదు డ్రగ్స్ కూడా పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మార్చి ఒకటవ తేదీ నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు 100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేస్తున్నట్టు భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటన విడుదల చేసింది.
ప్రతీరోజూ పట్టుబడుతున్న 100 కోట్ల నగదు
75 ఏళ్ల సార్వత్రిక ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ప్రతిరోజు 100 కోట్ల విలువైన నగదు, మద్యంతో పాటు ఇతర వస్తువులు జప్తు చేయడం జరిగిందని ఈసీ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికలు తొలిదశ ముందే భారీ స్థాయిలో నగదు ప్రవాహం కొనసాగుతుందని తాజా డేటా వెల్లడించింది. రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 4650 కోట్ల విలువైన నగదు, నగలు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

లోక్ సభ ఎన్నికల చరిత్రలో తొలిసారి
లోక్సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో సీజ్ చేసిన సందర్భాలు లేవని వెల్లడించింది. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్న కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు నగదు రూపంలో 395.39 కోట్లు, బంగారంతో పాటు ఇతర లోహాల రూపంలో 562.10 కోట్లు పట్టుబడ్డాయని పేర్కొంది.
ECI is on track for the highest ever seizures of inducements recorded in history of Lok Sabha elections; on average, Rs.100 crore seized every day since 1st March . Rs. 4650 crores seized even before polling begins: higher than in 2019 polls#GE2024https://t.co/VCIo3BVRQz pic.twitter.com/L2quiqUELK
— Spokesperson ECI (@SpokespersonECI) April 15, 2024
మొత్తం పట్టుబడిన వాటిలో డ్రగ్స్ దే అగ్రస్థానం
ఇక మద్యం రూపంలో 489.31 కోట్ల విలువ చేసే 3.58 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. అత్యధికంగా డ్రగ్స్ రూపంలో 2068 . 85 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడినట్లు చెబుతోంది. అంటే మొత్తం పట్టుబడిన వాటిలో డ్రగ్స్ దే అగ్రస్థానం అని తెలిపింది. ఇక బహుమతుల రూపంలో 1142. 49 కోట్లు ఉన్నట్టు వెల్లడించింది.

ఏపీలో 125. 97 కోట్లు స్వాధీనం,
ఇదిలా ఉంటే మార్చి ఒకటవ తేదీ నుంచి ఈరోజు వరకు సగటున 100 కోట్ల మేరా పట్టు పడుతున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 125. 97 కోట్లు స్వాధీనం చేసుకోగా, తెలంగాణా రాష్ట్రం నుంచి 121.84 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. ఇక ఎన్నికలు తొలిదశ ముందే ఇలా ఉంటే ఎన్నికలు పూర్తయ్యే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications