రుతుపవనాల రాకపై కీలక అప్ డేట్ - మరో నాలుగు రోజులు ఇలా..!!

నైరుతి రుతుపవనాల రాక పై వాతావరణ శాఖ కీలక సమాచారం అందించింది. గతంలో అంచనా వేసినట్లుగా జూన్ 4 (ఆదివారం) కేరళ తీరాన్ని తాకలేదు. సాధారణంగా జూన్‌ ఒకటో తేదీ నాటికి (అటుఇటుగా నాలుగు రోజులు) కేరళను రుతుపవనాలు తాకాలి. దీంతో, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరో మూడు, నాలుగు రోజులు సమయం పడుతుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. మరో నాలుగు రోజులు 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు..వడగాల్పులు వీస్తాయని హెచ్చరించారు.

మరింత ఆలస్యం :నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. భారత వాతావరణ శాఖ అంచనా తప్పింది. గత నెలలో అంచనా వేసినట్టుగా ఆదివారం కేరళ తీరాన్ని తాకలేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మరో మూడు, నాలుగు రోజులు సమయం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రుతుపవనాలు ప్రవేశానికి అనుకూలంగా దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమర గాలులు వీస్తున్నప్పటికీ అవి మరింత బలపడాల్సి ఉంది. ఇంకా ఆగ్నేయ అరేబియా సముద్రంలో రుతుపవన మేఘాలు కమ్ముకున్నాయి. రుతుపవనాలపై ఈ రోజు వాతావరణ శాఖ స్పష్టత ఇవ్వనుంది. ముందుగా వేసిన అంచనా మేరకు తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల్లో రుతుపవనాలు విస్తరిస్తాయని భావించారు. ఇప్పుడు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

Monsoon arrival may be delayed ,IMD predicts will set in over Kerala by June 8th

ఎండలతో ఉక్కిరిబిక్కిరి:ఆదివారం ఎండ తీవ్రతకు ఏపీ ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రి 10 గంటల వరకు సెగలు తగ్గటం లేదు. మరో నాలుగు రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గటంతో వడగాలుల ప్రభావం పెరిగింది. దక్షణ కోస్తా జిలాల్లో వేడిగాలులతో ఉక్కపోత పెరిగింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఎండ సమయంలో బటయకు రాకపోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా కౌతవరంలో 44.8, గుంటూరు జిల్లా నూతక్కిలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా సాయంత్రానికి కొంత చల్లబడుతోంది.

అప్రమత్తంగా ఉండాలి:కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదైంది. పలు జిల్లాల్లో సాయంత్రం 6 గంటల తరువాత కూడా గరిష్ఠంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో బాపట్ల, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు మండలాల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈ రకమైన వాతావరణ పరిస్థితుల్లో ఆరోగ్యం పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, మిగిలినచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+