నైరుతి రుతుపవనాల ఎంట్రీ: ఏపీలో రానున్న మూడురోజులపాటు వర్షాలు
అమరావతి: ఇటీవల అసని తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అనేకచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలు ఇళ్లు కూలిపోయాయి. రైతులు పండించిన పంట నీటిపాలైంది. ఈ నష్టంతోనే ప్రజలు, రైతులు ఆవేదనకు గురవుతుండగా.. తాజాగా, మరో మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి రుతుపవనాల ఎంట్రీ
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా బీహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి సోమవారం ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు, విదర్భ మధ్య కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్లు ఎత్తులో ఉంది. తీర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ఫలితంగానే ఏపీలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఉత్తరకోస్తాలో సోమవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. కాగా, దక్షిణకోస్తా ప్రాంతంలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

రాయలసీమలోనూ మూడు రోజులపాటు వర్షాలు
మరోవైపు, రాయలసీమ ప్రాంతంలోనూ సోమవారం నుంచి మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లలులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications