విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లీజ్! ‘జూ’ను తరలించొద్దు: కొనసాగుతున్న నిరసనలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల (జూ)ను తరలింపునకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జూ తరలించే అంశాన్ని విరమించుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని ప్రజాసంఘాలు హెచ్చరించాయి.

ప్రస్తుతం ఉన్న జూను కంబాలకొండకు తరలించి, జూ ఉన్న ప్రాంతంలో బొటానికిల్ గార్డెన్ ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జివిఎంసి గాంధీ విగ్రహం ఎదుట వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులు, విద్యార్థులు జూ తరలింపునకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు.

నగరానికి అతి సమీపంలో ఉన్న జూను తరలించడం ద్వారా ఇక్కడ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దూరం చేయవద్దని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు జంతువులు, పక్షుల మాస్కులను ధరించి జూను తరలించవద్దంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు జి దేవి, గీతాంజలి, రజని, భారతి, కాంతం, సునీత, బాలమోహన్ దాస్, జెపిసి శర్మ తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ నిరసన

జంతు ప్రదర్శన శాలను వేరే చోటికి తరలించాలన్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు.

మాస్కులు ధరించి చిన్నారుల నిరసన

మాస్కులు ధరించి చిన్నారుల నిరసన

ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాల (జూ)ను తరలింపునకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

చిన్నారుల నిరసన

చిన్నారుల నిరసన

జూ తరలించే అంశాన్ని విరమించుకోని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని ప్రజాసంఘాలు హెచ్చరించాయి.

చిన్నారుల నిరసన

చిన్నారుల నిరసన

ప్రస్తుతం ఉన్న జూను కంబాలకొండకు తరలించి, జూ ఉన్న ప్రాంతంలో బొటానికిల్ గార్డెన్ ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చిన్నారుల నిరసన

చిన్నారుల నిరసన

జివిఎంసి గాంధీ విగ్రహం ఎదుట వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులు, విద్యార్థులు జూ తరలింపునకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించారు.

చిన్నారుల నిరసన

చిన్నారుల నిరసన

ఈ సందర్భంగా వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధి జివి సత్యకుమారి మాట్లాడుతూ.. ఎత్తైన కొండలతో కూడి, అభయారణ్యాన్ని తలపించే జూను తరలిస్తే పర్యావరణం పరంగా ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు.

చిన్నారుల నిరసన

చిన్నారుల నిరసన

నగరానికి అతి సమీపంలో ఉన్న జూను తరలించడం ద్వారా ఇక్కడ ఉండే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని దూరం చేయవద్దని కోరారు.

English summary
Protests over the proposal to shift Indira Gandhi Zoological Park continue in the city with various NGOs and Opposition parties hitting the roads and showing their concern for the natural habitat. CPM leaders and some NGOs staged a protest and convened meetings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X