వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నివురు గప్పిన నిప్పులా హిందూపురం!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో హిందూపురం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకే ఇక్కడి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. రానున్న ఎన్నికల్లో దీన్ని కైవసం చేసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే సీటు కోసం నేతల మధ్య వివాదాలు తలెత్తడం.. వాటిని అధిష్టానం సర్దిచెప్పడం లాంటివి జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకు గురయ్యారు.

బంద్ లో పాల్గొన్న వైసీపీ!

బంద్ లో పాల్గొన్న వైసీపీ!


అప్పటి నుంచి నియోజకవర్గ వాతావరణం మారిపోయింది. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. కారులోనుంచి దిగుతున్న రామకృష్ణారెడ్డిపై వేటకొడవళ్లతో దాడిచేసి, కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి చంపేశారు. హత్యకు రాజకీయాలే కారణమని తేలడంతో పట్టణంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
అఖిలపక్ష నేతలంతా నిందితులను అరెస్ట్ చేయాలంటూ సోమవారం బంద్ నిర్వహించారు. ఈ బంద్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొనడం గమనార్హం.

పట్టణంలో 30 యాక్ట్ అమలు

పట్టణంలో 30 యాక్ట్ అమలు

నిందితులను అరెస్ట్ చేశామని, ఎవరికైనా అనుమానాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిరసన కార్యక్రమాలు, బంద్ లకు మాత్రం అనుమతిచ్చేది లేదంటున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణ, కీలక నిందితులుగా ఉన్న వరుణ్, మహేష్ తో మాట్లాడిన ఆడియోలు బయటపడటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పట్టణంలో 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ను ఏ1గా, అతని ప్రయివేట్ పీఏ గోపీకృష్ణను ఏ2గా, సీఐ జీటీ నాయుడును ఏ3గా నమోదు చేయాలని, సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

తనకు సంబంధం లేదంటున్న ఎమ్మెల్సీ ఇక్బాల్

తనకు సంబంధం లేదంటున్న ఎమ్మెల్సీ ఇక్బాల్


ఇక్బాల్ పై ఆరోపణలు రాగా తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. ఆయన పీఏ గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. రామకృష్ణారెడ్డి హత్య జరిగిన తర్వాత రోజే ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు పడింది. ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు వారంతా అండగా నిలుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో అధికార పార్టీ రెండువర్గాలుగా చీలిపోయింది. రామకృష్ణారెడ్డి గతంలో ఇక్బాల్ వర్గంలోనే ఉండేవారు. విభేదాలతో వేరేవర్గంలోకి మారారు. ఇక్బాల్ ప్రయివేట్ పీఏ గోపీకృష్ణపై చౌళూరు పలు ఆరోపణలు చేశారు. హత్యకు ముందు అతన్ని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

English summary
He clarified that he had nothing to do with the allegations against mlc Iqbal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X