తల్లీకూతుళ్లపై కిరోసిన్ పోసి నిప్పటించిన వ్యక్తి: బస్సు బీభత్సం
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ మండలం సంఘంబండలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గత అర్థరాత్రి తల్లీకూతుళ్లపై ఆదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సంఘంబండకు చెందిన సబీనాబేగంకు ఇద్దరు కుమార్తెలు. భర్తకు దూరంగా ఉంటూ మహిళా సంఘంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో గత రాత్రి సబీనా ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో ఘర్షణకు దిగాడు. గొడవ తీవ్రస్థాయికి చేరుకోవడంతో వచ్చిన వ్యక్తి సబీనా, ఆమె పెద్దకూతురిపై కిరోసిన్‌పోసి నిప్పటించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మంత్రగాడనే పేరుతో దాడి

మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం ముప్పిరెడ్డి పల్లెలో మంత్రాల నెంపతో ఓ కుటుంబంపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
స్కూల్ బస్సు బీభత్సం
హైదరాబాద్ నగరంలోని మీర్‌పేటలో ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ బస్సు ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది. బస్సు వేగంగా రావటాన్ని గమనించి పాదచారులు పక్కకు తప్పుకోవడంతో పక్కనే ఉన్న కరెంట్ పోల్‌కు ఢీకొని నిలిచిపోయింది.
మద్యం మత్తులో డ్రైవర్ బస్సు నడపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు ఆగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం స్కూల్ యాజమాన్యానికి, పోలీసులు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications