వివాహేతర సంబంధం: ప్రియుడితో సహజీవనం, కూతురును చంపిన తల్లి
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంగా కన్న కూతురినే ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ తల్లి. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో వెలుగు చూసింది.
చిత్తూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంగా కన్న కూతురినే ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ తల్లి. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో వెలుగు చూసింది.తమ సంబంధానికి అడ్డుగా ఉంటుందని భావించిన తల్లి మూడేళ్ళుగా కూతురిని చిత్రహింసలు పెడుతోంది. అయితే తమ బంధానికి అడ్డు తొలగించుకొనేందుకుగాను బిడ్డను చంపేసింది ఆ తల్లి.
వివాహేతర సంబంధం కోసం కూతురును చంపిన ఘటన మాతృత్వానికి మచ్చగా నిలిచింది. ఈ ఘటన మదనపల్లిలో సంచలనం సృష్టించింది. అయితే బిడ్డ గురించి స్థానికులు నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది.
స్థానికులు పోలీసులకు పిర్యాదు చేయడంతో అసలు వాస్తవాన్ని ఒప్పుకొన్నారు నిందితులు. అయితే తమ సుఖానికి అడ్డుగా ఉంటుందనే ఒకే ఒక్క కారణంతో బిడ్డను చంపేసినట్టు నిందితులు ఒప్పుకొన్నారు.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని చంపేశారు
వివాహేతర సంబంధానికి బిడ్డ అడ్డొస్తోందని.. భావించిన ఓ మహిళ ప్రియుడితో కలసి కన్నబిడ్డను గొంతు నులిమి చంపింది. ఈ సంఘటన శనివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది.శాంతమ్మ అనే వివాహిత, ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. శాంతమ్మ వద్ద ఉంటున్న కూతురును శివానిని చిత్ర హింసలు పెట్టేది. అయితే తమ సంబంధానికి అడ్డుగా ఉందని కూతురును చంపేశారు. ప్రియుడితో కలిసి కూతురు శివానిని గొంతు పిసికి తల్లి శాంతమ్మ హత్య చేసింది.

భర్తకు దూరంగా ఆటో డ్రైవర్‌తో సహజీవనం
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం ఎగువ మాచిరెడ్డిగారిపల్లెకు చెందిన బోయకొండప్పకు ఎనిమిదేళ్ల క్రితం ఐరాల మండలం మొరాలపల్లెకు చెందిన శాంతమ్మతో వివాహమైంది. వీరికి కుమారుడు కృష్ణ, కుమార్తె శివాని ఉన్నారు.ఏడాది కిందట భార్యాభర్తలకు మనస్పర్ధలు రావడంతో గొడవపడి విడిపోయారు. అయితే ఆరు మాసాల నుండి శాంతమ్మ రామసముద్రం మండలానికి చెందిన ఆటోడ్రైవర్ శ్రీనివాసులుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఈ క్రమంలో వీరిద్దరూ మదనపల్లె పట్టణం కాట్లాటపల్లెరోడ్డులో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.

పుంగనూరు నుండి తిరిగొస్తూ
మూడురోజుల కిందట వీరిద్దరూ బిడ్డను తీసుకుని ఆటోలో పుంగనూరుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొస్తూ..మార్గమధ్యంలో సుగాలిమిట్ట వద్ద బిడ్డను గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని మదనపల్లె మండలం కొత్తపల్లె సమీపంలోని దాసరివంకలో పడేశారు. బిడ్డ కోసం స్థానికులు నిలదీయడంతో పొంతనలేని సమాధానాలను శాంతమ్మ చెప్పింది. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

పోలీసుల రంగ ప్రవేశంతో
స్థానికులు శాంతమ్మ, శ్రీనివాసులు తీరుతో పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే ఈ విషయమై పోలీసులు రంగ ప్రవేశం చేసి శాంతమ్మ, శ్రీనివాసులును విచారిస్తే అసలు విషయాన్ని ఒప్పుకొన్నారు.దాసరివంకలో శివాని మృతదేహన్ని స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులను స్టేషన్‌కు తరలించి కేసుదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications