చంద్రబాబు ఓటమితో ఆనందంలో.. శ్రీవారికి మొక్కు చెల్లించి సంచలన వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి
టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదుఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో స్వీట్లు పంచుతూ ఎంజాయ్ చేసిన మోత్కుపల్లి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కు చెల్లించుకున్నారు. ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోత్కుపల్లి నర్సింహులు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓడిపోవాలని మెుక్కుకున్నట్లు ప్రకటించారు.

టీడీపీ ఓటమికోసం తిరుమలలో మోత్కుపల్లి మొక్కు .. నడిచివెళ్ళి మొక్కు తీర్చుకున్న మోత్కుపల్లి
ఎన్నికలకు ముందు చంద్రబాబును టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మోత్కుపల్లి తిరుమల శ్రీవారిని టీడీపీ ఓటమిపాలు కావాలని కోరుకున్నారట. కోరుకున్నట్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్లి స్వామి వారి మెుక్కులు చెల్లించిన మోత్కుపల్లి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఓటమితో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది అన్న మోత్కుపల్లి
చంద్రబాబు ఓటమే తన పంతం అంటూ పదేపదే చెప్పిన మోత్కుపల్లి జగన్ సీఎం కావటంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో ఆయన ఎంజాయ్ చేశారు. అభిమానులకు, కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ఏపీకి చంద్రబాబులాంటి దుర్మార్గుడి పీడ వదిలిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి అనంతరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు సైతం అర్పించారు. చంద్రబాబు నాయుడు ఘోరపరాజయంతో దివంగత సీఎం ఎన్టీఆర్ ఆత్మ ఘోష శాంతిస్తుందని స్పష్టం చేశారు. ఎన్టీఅర్ వంటి గొప్ప నాయకుడు ,దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీ బాధ్యత అప్పగించాలని షాకింగ్ కామెంట్
చంద్రబాబు వెన్నుపోటుతోనే ఎన్టీఆర్ ప్రాణాలు వదిలారని, ఆయన ప్రాణాలు తీయటమే కాకుండా బ్యాంక్ అకౌంట్స్ కూడా లాక్కున్నారని చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అందరినీ మోసం చేసి ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడారనిఎద్దేవా చేశారు మోత్కుపల్లి . ఏమాత్రం మనస్సాక్షి ఉన్న చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించాలన్నారు. గతంలో మోత్కుపల్లి నర్సింహులు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కొనసాగారు. అయితే పార్టీలో ఉంటూ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక అప్పటి నుండి చంద్రబాబుపై మాటలతో విరుచుకుపడుతున్నారు మోత్కుపల్లి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications