జగన్ అహంకారం వల్లే వైసీపీ ఓడిపోయింది..మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది. ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ పార్టీ సాధించని రితీలో కూటమి ఘన విజయం సాధించింది.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ వంటి నేతలు భారీ విజయాలను నమోదు చేశారు.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి.

ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా వైసీపీ ఓటమిపై తెలంగాణ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు స్పందించారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి జగన్ అహంకారమే కారణమని తేల్చి చెప్పారు.జగన్ అహంకారం వల్లే ఈ రోజున ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఏపీలో ఘన విజయం సాధించిన కూటమి నేతలకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబుకు ఆయన అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications