మాతోనే మొదలు..వైసిపి లోకి ఇక క్యూ: అవినీతి కారణంగానే మోదీ సీరియస్ : వైసిపి లో చేరిన అవంతి
ఊహించిందే జరిగింది. టిడిపి నుండి అనకాపల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాస రావు వైసిపి లో చేరారు. వైసిపి అధినే త ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు - కేంద్రం మధ్య అగాధానికి గత కారణాలను అవంతి శ్రీనివాస్ బయట పెట్టారు. ఏపి ప్రభుత్వం అవినీతి కారణంగా ఏపికి ప్రత్యేక హోదా రాలేదని స్పష్టం చేసారు.

టిడిపి..ఎంపి పదవికి రాజీనామా..
అవంతి శ్రీనివాసరావు తన ఎంపి పదవికి..టిడిపికి రాజీనామా చేసారు. ఆ తరువాత లోటస్ పాండ్ లో జగన్ ను కలిసా రు. అంతకుముందు వైసిపి సీనియర్ నేత బొత్సా నివాసంలో విజయసాయిరెడ్డి..ఆమంచి కలిసి అవంతి శ్రీనివాస్ తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసిపి లోకి రావటానికి సిద్దంగా ఉన్నారని వారికి అకామిడేషన్ ఇవ్వాలని అవంత కోరారు. అయితే, ముందుగా పార్టీలో చేరాలని..వారి సంగతి విశాఖ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుందామంటూ వైసిపి నేతలు చెప్పుకొచ్చారు. ఆ తరువాత జగన్ తో భేటీ అయ్యారు. దీని ద్వారా తాను సీటు కోసం పార్టీ మారలేదని..ముఖ్యమంత్రి వ్యవహార శైలి నచ్చలేదని వివరించారు. అవినీతి..బంధుప్రీతి..కులాల వారీగా చీల్చటం వంటివి చేస్తున్నారని విమర్శించారు.

మాతో మొదలు..ఇంకా క్యూ లో అనేక మంది..
పార్టీలో చేరిన సమయంలో అవంతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. టిడిపి నుండి తనతో వైసిపి లోకి వలసలు ఆ రంభం అయ్యాయని..త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని స్పష్టం చేసారు. ప్రత్యేక హోదా విషయంలో వైసిపి ఎంపీలు రాజీనామా చేసినప్పుడే తాను రాజీనామా చేద్దామని ప్రతిపాదించినా ముఖ్యమంత్రి వినలేదని వివరించారు.
తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి తో ఒక్క వ్యక్తిగత పని కూడా చేయించుకోలేదని స్పష్టం చేసారు. తాము ప్రలోభాలకు గురి అయి పార్టీ మారలేదని..మరి చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి ఎన్నో యూ టర్న్‌లు తీసుకున్నారని..జగన్ తొలి నుండి ఒకే మాట మీద నిలబడ్డా రని ప్రశంసించారు. వైయస్ మీద గతంలో ఇదే రకంగా రూమర్లు సృష్టించారన్న అవంతి..ఇప్పుడు జగన్ మీద అలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారని చెప్పుకొచ్చారు.

అవినీతి కారణంగానే కేంద్రం దూరం పెట్టింది..
ముఖ్యమంత్రి చంద్రబాబు...ప్రధాని మోదీ మధ్య అసలు దూరం పెరగటానికి కారణం అవినీతి అని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేసారు. ఒక ఎమ్మెల్యే అవినీతి గురించి ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లిందని..దాని పై విచారణ చేయిం చటం ద్వారా ఏపిలో అవినీతి పై కేంద్రానికి పూర్తి అవగాహన వచ్చిందని చెప్పుకొచ్చారు. ఏపిలో జరుగుతున్న అవినీతి కారణంగా నే కేంద్రం ఏపికి ఏం చేయటం లేదని వివరించారు. 25 మంది ఎంపీలతో మోదీని దించేస్తానని చంద్రబాబు చెప్పటం పైనా అవంతి ఎద్దేవా చేసారు. 544 మంది ఎంపీలు ఉన్న సభలో 25 మంది సభ్యులతో ప్రధానిని దించేస్తారా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ను దూషించి..ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే ఏపికి న్యాయం చేస్తుందని చెబు తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తాను ఏది చెబితే ప్రజలు అది నమ్ముతారనే భావన తో ఉన్నారని.. ప్రజలు చాలా తెలవి గల వారని విశ్లేషించారు.












Click it and Unblock the Notifications