వైసీపీ క్యాడర్ నాశనం చేయటమే వారి లక్ష్యం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వ తీరు పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ను పరామర్శించిన అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం
వైసిపి క్యాడర్ ను నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఏపీ అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి వైసిపి నేతలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ అన్ని గుర్తు పెట్టుకుంటామని మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఎవరిని ఎట్టి పరిస్థితులలోను వదిలిపెట్టేది లేదని హెచ్చరిక
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను కడపలో పరామర్శించిన ఆయన ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్న ఎవరిని ఎట్టి పరిస్థితులలోను వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు
తీవ్రవాది తరహాలో అహ్మద్ బాషాను ముంబైకి వెళ్లి తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు. అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన తర్వాత టిడిపి నేతలు సంబరాలు చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి అహ్మద్ ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. టిడిపి నేతలు కడపలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి.
అంజద్ బాషా సోదరుడు అరెస్ట్
కాగా, కడపలో మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు అహ్మద్ బాషా పై అవుట్ లుక్ నోటీసులు ఉన్న నేపథ్యంలో ఇటీవల ముంబై ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. కువైట్ కి వెళుతున్న క్రమంలో అతనిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. వినాయక నగర్ లోని ఒక స్థలం విషయంలో దాడి చేశారని కడప పోలీస్ స్టేషన్లో అతని పైన కేసు నమోదు కావడంతో కడప పోలీసులు అతనిని కడపకు తరలించారు.












Click it and Unblock the Notifications