బాబుపై మోడీకి ఈర్ష్య, ద్వేషం, జగన్‌కు దమ్ముంటే ఈరోజే..: జేసీ సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విశాఖ రైల్వే జోన్‌పై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ చిన్న అంశమే కానీ అది ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని ఆయన చెప్పారు.

  YS Jagan Fools People name of MPs resignation

  అంతేకాదు, రైల్వో జోన్ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా జేసీ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఒక గట్టి నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.

  బాబుపై మోడీకి ఈర్ష్య, ద్వేషం...

  బాబుపై మోడీకి ఈర్ష్య, ద్వేషం...

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ప్రధాని మోడీకి ఈర్ష్య, ద్వేషం ఉన్నట్లున్నాయని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అడిగినవన్నీ ఇస్తే చంద్రబాబు రాజకీయంగా ఎదిగిపోతారేమో అనే భయం ఉన్నట్లుందని, అందుకే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదేమో.. అని ఆయన వ్యాఖ్యానించారు.

  ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు...

  ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు...

  అయితే కేంద్రం ఇచ్చిన హామీలు ఎలా సాధించుకోవాలో తమ పార్టీకి బాగా తెలుసునని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే టీడీపీ దీని గురించి నిర్ణయం కూడా తీసుకుందని, ఇప్పుడు కొత్తగా ఆలోచించాల్సిన, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని ఎంపీ పేర్కొన్నారు.

  దమ్ముంటే ఈరోజే చేయించు...

  దమ్ముంటే ఈరోజే చేయించు...

  ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ వ్యాఖ్యలపై కూడా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌కు దమ్ముంటే ఇవాళే వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు.

   ఏప్రిల్‌లో రాజీనామాలు చేస్తే...

  ఏప్రిల్‌లో రాజీనామాలు చేస్తే...

  ఏప్రిల్‌లో తన పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తే ఆ తర్వాత ఉప ఎన్నికలు రావనేది వైఎస్ జగన్ ప్లాన్ అని, అందుకే ఆయన అలా చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి దుయ్యబట్టారు. ఏడాది క్రితం కూడా జగన్ ఇలాగే తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామన్నారని, మరి అదేమైంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

   శివప్రసాద్ కళాకారుడు.. అందుకే అలా...

  శివప్రసాద్ కళాకారుడు.. అందుకే అలా...

  లోక్‌సభలో ఎంపీల ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందన్న బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యలపైనా ఏంపీ జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ శివప్రసాద్‌ కళాకారుడు కాబట్టే అలా చేశారని వివరణ ఇచ్చారు. తమ పోరాటం తర్వాత కేంద్రంలో కదలిక వచ్చిందని, మార్చి 5 నాటికి కొన్ని నిధులు వస్తాయని దివాకర్‌రెడ్డి తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Anantapuram MP JC Diwakar Reddy made sensational comments on Vizag Railway Zone on Wednesday. While speaking with media he said it's small thing but it's related to people's sentiment. Actually there is no lot of gain with the railway zone, he added. But the time has come to take a strong decesion on the way how the Central Government is behaving with the State Government. MP JC told that Prime Minister Narendra Modi may be thinking that AP CM Chandrababu Naidu will raise more politically if the Centre grant everything what the State asked.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి