జగన్‌కు మీడియా మద్దతు లేదా, నిరూపిస్తే ఎన్నికల నుండి తప్పుకొంటాం: జెసి సంచలనం

మీడియా మద్దతు లేదని నిరూపిస్తే ఎన్నికల నుండి తప్పుకొంటామని జగన్‌కు జెసి సవాల్ప్రజలపై నమ్మకం లేని వ్యక్తి ఎన్ని రోజులు తిరిగినా ప్రయోజనం లేదన్నారు.

నంద్యాల: వైసీపీ చీఫ్ జగన్‌కు మీడియా మద్దతు లేదని నిరూపిస్తే నంద్యాలలో తామే ఎన్నికల నుండి ఉపసంహరించుకొంటామని అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

నంద్యాల ఉపఎన్నికల్లో ఇంత హంగామా అవసరం లేదని జెసి అభిప్రాయపడ్డారు. జగన్ తనకు మీడియా మద్దతు లేదని చెప్పడాన్ని జెసి దివాకర్‌రెడ్డి తప్పుబట్టారు. ఈ విషయాన్ని జగన్ నిరూపిస్తే ఎన్నికల నుండి తప్పుకొంటామని జెసి జగన్‌కు సవాల్ విసిరారు.

Mp Jc Diwakar reddy sensational comments on Ysrcp chief Ys Jagan

జగన్‌కు మీడియా మద్దతు లేదంటున్న నేతలు... మహానేత అంటూ 24 గంటలు ఎలా ప్రచారం చేసుకొంటున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లో నమ్మకం లేని నేత ఎన్ని రోజులు రోడ్లపై తిరిగితే ఏం ప్రయోజనమంటూ జగన్‌పై జెసి ఆరోపణలు గుప్పించారు.

జగన్ ఎప్పటీకి ముఖ్యమంత్రి కాలేడని జెసి దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల కోసం శిల్పా 50 కోట్లు, జగన్ 50 కోట్లను నంద్యాలలో డంప్ చేశారని జెసి దివాకర్‌రెడ్డి ఆరోపించారు.

తన దగ్గర డబ్బులు లేవని చెప్పుకొంటున్న జగన్ జైలుకు ఎందుకు వెళ్ళారో చెప్పాలని జెసి దివాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నాయకుడు చెప్పే మాటల్లో విశ్వాసం ఉండాలని, నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీదే గెలుపు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజూ అబద్ధాలు చెబితే ఎవరు నమ్ముతారని జేసీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+