ప్రిన్స్‌టన్ కళాశాల ఆహ్వానం: అమెరికాకు ఎంపీలు కవిత, పూనమ్

హైదరాబాద్: అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాలపై ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నిర్వహించే సదస్సులో పాల్గొనేందుకు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం అమెరికాకు వెళ్లనున్నారు.

ఏప్రిల్ 5-9వ తేదీ వరకు న్యూజెర్సీలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఉడ్రో విల్సన్ అంతర్జాతీయ సంబంధాల కేంద్రంలో సదస్సు జరగనుంది. ది గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇనిషేయేటివ్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి.

ఐసిస్ తీవ్రవాదం సవాళ్లు, యూరప్‌లో ముస్లింల వలసలు, అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ అనంతర పరిస్థితులు, అణు ప్రయోగాలు - ఒప్పందాలు, సైబర్ నేరాలు, భద్రత, ఒబామా పర్యటన అనంతరం భారత - అమెరికా సంబంధాలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు.

MP Kalvakuntla Kavitha to leave for America

ఈ సెమినార్లో ఎంపీ కవితతో పాటు మహారాష్ట్ర ఎంపీలు పూనమ్ మహాజన్, వందనా చవాన్, అస్సాం ఎంపి గౌరవ్ గంగోయ్, బీహార్ ఎంపి కీర్తి ఆజాద్, ఉత్తర ప్రదేశ్ ఎంపీ యశ్వంత్ సింగ్‌లు పాల్గొంటారు. అమెరికా పర్యటనలో కవిత ప్రవాస తెలంగాణీయుల సంఘాలు ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు.

మంగళవారం రాత్రి ఆమె అమెరికా బయలుదేరనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే కార్యక్రమాలలో ఆమె ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాలపై నిర్వహించే సెమినార్‌లో పాల్గొనాలని కవితకు ఇటీవల ఆహ్వానం అందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+