నాది వాస్తవం!: కేశినేని నాని ట్విస్ట్, రఘువీరా ఆగ్రహం
హైదరాబాద్: విజయవాడలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం లేదన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని నాని ఆదివారం మరో ట్విస్ట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు.
బహిరంగ వ్యాఖ్యలు వద్దని చంద్రబాబు సూచించారన్నారు. విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్రమంత్రి సుజనా చౌదరితో రేపు సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలకు ఇందులో పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.

ట్రాఫిక్ సమస్యకు కారణమవుతున్న దుర్గగుడి ప్రాంతంలో రూ.242 కోట్లతో ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి ఇచ్చిందని చెప్పారు. త్వరలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కాగా, కేశినేని నాని తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. కేవలం బహిరంగంగా మాట్లాడినందుకు మాత్రమే క్షమాపణలు చెప్పడం గమనార్హం.
టీడీపీ పాలనలో ఎన్నో అక్రమాలు: రఘువీరా రెడ్డి
చంద్రబాబు ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి విజయవాడలో ధ్వజమెత్తారు. ఆరు నెలల టీడీపీ పాలనలో పలు అక్రమాలు వెలుగు చూశాయన్నారు. రాష్ట్రాన్ని కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ ఆరు నెలల్లో ఇసుమంతైనా అభివృద్ధి కాలేదన్నారు.












Click it and Unblock the Notifications