లిక్కర్ స్కాం పై షా హామీ - వైసీపీ ముఖ్యులకు బిగిస్తున్న ఉచ్చు..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం గత వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలు.. అవినీతి పైన విచారణకు ఆదేశించింది. లిక్కర్ స్కాం లో వేల కోట్ల రూపాయాల అవినీతి ఉందని ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసు సీఐడీ విచారిస్తోంది. ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రమేయం పైన టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మిథున్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసారు. ఇదే సమయంలో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవ రాయలుకు అమిత్ షా హామీ అంశం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
అమిత్ షా ఆరా
ఏపీ లిక్కర్ స్కాం ఇప్పుడు కీలక మలుపు తీసుకుంటోంది. లోక్‌సభ వేదికగా టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఆరోపణల పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించారు. ఈ అంశం పైన అమిత్ షా తో సమావేశమైన లావు కేసు మూలాల ను వివరించారు. సంబంధిత కీలక పత్రాల ను అందజేశారు. రూ.90వేల కోట్ల మద్యం వ్యాపారంలో రూ.18 వేల కోట్లు దుర్వినియోగమయ్యా యని పేర్కొన్నారు. మరో రూ.4 వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారన్న ఆరోపణలపై హోంమంత్రి ఆరా తీసినట్లు సమాచారం.

భారీ కుంభకోణం
ఇదే వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన సునీల్‌రెడ్డి రూ.2 వేల కోట్లను దుబాయ్‌కి తరలించిన కీలకపత్రాలను లావు అందించినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటపడతాయని పేర్కొన్నారు. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్ ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఏపీ మద్యం కుంభకోణం పర్యవసానాల వల్లే ఒక ఎంపీ రాజీనామా చేసి, రాజకీయాల నుంచి నిష్క్రమించిన అంశాన్ని కూడా లావు వివరించారు. రాష్ట్రంలోని 22 డిస్టిలరీలను చేజిక్కించుకుని అర్థంపర్థం లేని బ్రాండ్లతో 26 కొత్త కంపెనీలను ప్రారంభించారని అమిత్ షాకు వివరించారు.
ఈడీ విచారణ కోసం
ప్రభుత్వ దుకాణాలలో రూ.99 వేల కోట్ల మేరకు అమ్మకాలు జరిగితే, అందులో రూ.690 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయని నివేదించారు. లోక్ సభలో ఎంపీ లావు వైసీపీ హయాం లో ప్రైవేట్ ఐఎంఎఫ్ఎల్ లను , డిస్టిలరీలను అక్రమంగా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుని, 60శాతం ఉత్పతి సామర్థ్యాన్ని కొత్తగా ఏర్పాటైన కంపెనీలకు అప్పగించారని ఆరోపించారు. 2019 -2024 మధ్య 38 కొత్త బ్రాండ్లను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెబుతూ, అవన్నీ అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు చెందినవని తెలిపారు. రూ.20,356 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఈ స్కాం విచారణ కోసం ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications